Konda Reddis – History & Lifestyle
ఆదిమజాతులుగా గుర్తించిన వారిలో వీరు మొదటివారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గల గోదావరి నది పరివాహక ప్రాంతంలో వీరు నివసిస్తుంటారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తూ జీవనం సాగించడం వలన వీరిని కొండరెడ్లని, హీల్ రెడ్లని, రాచరెడ్లని, పాండవరెడ్లని రకరకాల పేర్లతో పిలుస్తారు. వీరు తెలుగు భాషలోనే మాట్లాడుతారు. గడ్డితోను, తాటాకులతోనూ కప్పిఉండే చిన్న చిన్న గృహాల్లో వీరు నివసిస్తారు. అడవిలో లభించే వెదురు బొంగులతో గృహాలను నిర్మించుకుంటారు. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. …