Komaram Bheem Story in Telugu & English – A Forgotten Adivasi Leader

In this article you’ll explore the real-life story of great A Forgotten – Great Adivasi Leader “Komaram Bheem” in regional language Telugu and English as well.

Komaram Bheem Story in Telugu

నిజాం రాజ్యంలోని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డివిజన్‌లోని జోడేఘాట్ అటవీ ప్రాంతంలో గిరిజన గోండు తెగకు చెందిన చిన్నూ, సోమ్ బాయి దంపతులకు 22 అక్టోబర్, 1901వ తేదీన కొమురం భీమ్ జన్మించాడు. హైదరాబాద్ రాజ్య నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ గిరిజనులపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా కొమురం భీమ్ పోరాటాలు సాగించాడు. నిరక్షరాస్యుడైనప్పటికీ తన నాయకత్వ పటిమతో గిరజన యువకులను, ప్రజలను నిజాం పాలకులకు వ్యతిరేకంగా యుద్ధం చేసేలాగా తయారు చేశాడు. బాహ్య ప్రపంచానికి తానెవరో తెలియ పోయినా రాబోయే తరాల వారికోసం గెరిల్లా తరహా బలగాలను తయారు చేసి నూతన పోరాట పంథాను ప్రారంభించిన ఘనత భీమ్ దేనని చెప్పవచ్చు.

కోర్టులు, చట్టాలు మొదలైన అనేక రకాల నిజాం అధికారాలను ధిక్కరించి ప్రత్యక్షంగా నిజాం సైనికుల మీద కూడా తిరుగబడి పోరాటాలు సాగించాడు. ‘జల్-జంగల్-జమీన్’ అనే నినాదాన్నిచ్చి అడవులలో నివసించే గిరిజనులకు అడవికి సంబంధించిన అన్ని వనరులపై హక్కు ఉండాలని నమ్మిన వ్యక్తి కొమురం భీమ్.
జోడేఘాట్ పరిసర ప్రాంతంలో గిరిజన జాతికి చెందిన గోండులు, పరధాన్లు, కోలామ్ లు, తోటీలు, నాయకపోండ్లు

పోడు వ్యవసాయమే జీవనాధారంగా నివసిస్తుండేవారు. వీరు నిజాం ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష నియంత్రణలో లేకపోవడంతో 1917లో నిజాం ప్రభుత్వం ఆదివాసుల భూముల పరిరక్షణ అనే అంశంతో అమలులోకి తెచ్చిన అటవీ చట్టం ప్రకారం గిరిజనులపై అనేక పరిమితులు విధించబడినవి. వారిపై పన్నుల భారం కూడా మోపడం జరిగింది. పశువులను మేపేవారిపై, కలప ఏరుకొనే వారిపై రకరకాల పన్నులు విధించడంతో గిరిజన జీవితాలు అతలాకుతలమైనాయి. పోడు వ్యవసాయం ద్వారా పంటలు పండించుకుని, అడవులను ఆర్థికాదాయ వనరులుగా భావించే వీరికి కనీసం నగదు వాడటం కూడా తెలియదు. అలాంటి వారిపైన ప్రభుత్వం అటవీ చట్టంతో పన్నుల భారం మోపడంతో అనేక బాధలు అనుభవించేవారు. దీనికితోడు గిరిజనేతరులు మరియు అధికారులు, వడ్డీ వ్యాపారులు అమాయకులైన గిరిజనుల భూములను ఆక్రమించడమే కాకుండా గిరిజనులపై తప్పుడు కేసులను బనాయించి ఇబ్బందులకు గురిచేసేవారు.

Komaram Bheem Real life Story in Telugu

ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తున్న యువకుడైన కొమురం భీమ్ పరిష్కార మార్గాల దిశగా అడుగులు వేస్తున్న సమయంలోనే అతని తండ్రి మరణించడంతో అతడి కుటుంబం సంకెపల్లి నుంచి సుర్గాపూర్ గ్రామానికి వలస వెళ్ళాల్సి వచ్చింది. ఇదే సమయంలో భీమ్ దోపిడీదారులకు ఎదురొడ్డి నిలిచి పోరాడిన గోండు వీరులైన బిర్సాముండా, రాంజీ గోండ్ వంటి వీరుల గురించి తెలుసుకొని తన జాతి ప్రజలకు ఏదైనా మంచి చేయాలని సంకల్పించాడు. అటువంటి సమయంలోనే ఒకానొక భూవివాద సందర్భంలో భీమ్ సిద్ధిఖీ అనే పట్టేదారును హత్యచేయడం అతని జీవితాన్ని మలుపు తిప్పింది.

సిద్ధిఖీని హత్య చేసిన అనంతరం భీమ్ మహారాష్ట్రకు పారిపోయి అనేక ప్రదేశాల్లో రకరకాల పనులను చేస్తూ జీవనం సాగించాడు. అక్కడ ఒక ముద్రణా సంస్థలో పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడన్న నెపంతో బ్రిటీష్ అధికారులు అరెస్టు చేయడానికి రాగా అక్కడి నుంచి తప్పించుకొని అస్సాంకు పారిపోయాడు. కొంతకాలం తరువాత పెత్తందారీల కింద నలుగుతున్న తన ప్రజల కోసం ఏమైనా చేయాలన్న సంకల్పంతో స్వస్థలానికి చేరుకున్నాడు. మరాఠీ, ఉర్దూ, తెలుగు భాషలలో నిష్ణాతుడవడం వలన కాకఘాట్ గూడెం అధిపతి అయిన లచ్చుపటేల్‌కు బాగా దగ్గరివాడైనాడు. ఒకానొక భూవివాద కేసులో లచ్చుపటేల్ ను గెలిపించడంతో గోండు, కొలాంలలో భీమ్ పలుకుబడి పెరిగింది. ఇదే సమయంలో భీమ కు సోమ్ బాయితో వివాహం జరిగింది.

స్వయం పాలన కింద తమకు పన్నెండు గ్రామాలతో కూడిన స్వతంత్ర్య గోండు రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ తో జరిపిన చర్చలు విఫలం కావడంతో నిజాం ప్రభువును కలిసి సమస్యకు పరిష్కారం చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళగా అక్కడ అతనికి నిజాంనుంచి అనుమతి లభించలేదు. ఇక గెరిల్లా పోరాటాలతోనే తమ స్వతంత్ర్య రాజ్య ఏర్పాటు సాధ్యమని భావించిన భీమ్ నిజాం సైన్యాన్ని ఎదుర్కోవాలి అని దృఢ నిశ్చయంతో జోడే ఘాట్ కు తిరుగు ప్రయాణమయ్యాడు.

komaram bheem
Komaram Bheem (Source – Wikipedia)

జోడే ఘాట్ గుట్ట ప్రాంతాల్లో గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి నిజాం సైన్యంతో పోరాటాలు సాగించాడు భీమ్. అతనితో జరిపిన చర్చలు ఫలించకపోవడం వలన భీమ్ మరణిస్తేనే ఆ తిరుగుబాటు ఆగుతుందని భావించిన నిజాం సర్కార్ భీమ్ దగ్గర పనిచేసే కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి సహాయంతో భీమ్ ఉండే స్థావరాన్ని సైన్యం చుట్టుముట్టింది. సెప్టెంబర్ 1, 1940వ తేదీన ఇరువర్గాలకి మధ్య జరిగిన భీకర పోరాటంలో నిజాం సైన్యానిదే పైచేయి కావడంతో ఆ దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా హోరాహోరీగా పోరాడుతున్న భీమ్ గుండెల్లో తూటాలు తగలడంతో అమరుడైనాడు. గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన కొమురం భీమ్ వారి స్మృతుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

Komaram Bheem Story in English

Frequently Asked Questions on Komaram Bheem Story

Where did Komaram Bheem died?

He was died in Jodeghat region while fighting with Nijam army. On Sept 1st, 1940 the great adivasi leader is marteryed for tribal people in Telangana.

జోడే ఘాట్ గుట్ట ప్రాంతాల్లో గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి నిజాం సైన్యంతో పోరాటాలు సాగించాడు భీమ్. అతనితో జరిపిన చర్చలు ఫలించకపోవడం వలన భీమ్ మరణిస్తేనే ఆ తిరుగుబాటు ఆగుతుందని భావించిన నిజాం సర్కార్ భీమ్ దగ్గర పనిచేసే కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి సహాయంతో భీమ్ ఉండే స్థావరాన్ని సైన్యం చుట్టుముట్టింది. సెప్టెంబర్ 1, 1940వ తేదీన ఇరువర్గాలకి మధ్య జరిగిన భీకర పోరాటంలో నిజాం సైన్యానిదే పైచేయి కావడంతో ఆ దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా హోరాహోరీగా పోరాడుతున్న భీమ్ గుండెల్లో తూటాలు తగలడంతో అమరుడైనాడు.

What was Komaram Bheem fondly called?

What are the qualities of Komaram Bheem?

Where is Komaram Bheem from?

What religion is komaram?

What is the name of Komaram Bheem Wife?

Telangana’s Freedom Fighters autobiographies

Chakali Ilamma