alluri sitarama raju real life story

Alluri Sitarama Raju Story in Telugu and English – Unknown Facts

Alluri Sitarama Raju Story in English

Alluri Sitarama Raju, who was popularly known as the hero of the Rampa movement, was born on July 4 1897, in Pandrangi of Visakha district to Venkata Rama Raju and Suryanarayanamma. There was propaganda that he was born in Mogallu (a village in West Godavari district) because his ancestors belonged to Mogallu. But after several discussions and research, the Joint Madras State Legislative Committee confirmed Ramaraju was born in the village of Pandrangi, where his maternal grandmother lived.

There is no doubt that Alluri Sitaramaraju laid the seeds for the revolution in the history of the Andhra Pradesh independence movement. He was the leader of the Rampa movement, which took place in the Godavari Agency area between 1922 – 1924. Fascinated by the non-cooperation movement in the country by 1921, Ramaraju firmly believed that the country could achieve independence only through a policy of violence.

In July 1921, he went to Chittagong, the epicenter of the revolutions, and negotiated with the Bengal revolutionaries to acquire independence. After returning from Chittagong, he turned the Goodem mountain range in the East Godavari district into a base for his activities. Ramaraju led the struggle against the British, standing by and leading the dissatisfied people who were living an unhappy life due to the atrocities, the methods of subjugation, and the hardships of paddy farming committed by the Tehsildar Bastian on the innocent tribes.

Ramaraju started raiding police stations for the weapons needed to continue the revolution. He first raided the Chintapalli police station on August 22, 1922, and seized the weapons there. Later with the help of Gam Mallu Dora and Gam Gantam Dora, Ramaraju attacked Krishnadevipeta and Rajavommangi police stations. The government sent Scott Ward and Hatters to Bellary police to monitor Ramaraju’s attacks. Knowing this through his followers, Ramaraju attacked the dense forest of Damanapallighat and killed Scott Ward, Hatter, and four police.

On December 6, 1922, Ramaraju escaped when the police suddenly attacked him in the Peddagaddapalam area. Ramaraju remained silent without carrying out any revolutionary activities for a few days. On April 18, 1923, Ramaraju resumed his operations and attacked the Annavaram police station. From there, he went to Sankavaram. The people of Sankhavaram gave a warm welcome to Ramaraju.

Related Article – Komaram Bheem Story

On September 18, 1923, Gam Malludora was found by the police. The government took many precautions without weapons in the police station due to the attacks on Ramaraju police stations. This time, the British government deployed two Assam Rifles troops and appointed Rutherford as special commissioner to capture Ramaraju under any circumstances. On May 6, 1924, Pericharla Suryanarayana, known as Aggiraju, who was closest to Rama Raju, was found by the police at Madderu. Jamindar Kanchumenon cunningly captured Ramaraju on May 7, 1924.

Ramaraju was brought to Koyyuru, where the police killed him. After the incident, the police arrested Ramaraju’s followers one by one and shot them. By June 1924, the Rampa revolution was almost over. His tomb was built at Krishnadevi Peta as a symbol of Ramaraju’s heroism.

alluri sitarama raju
Alluri Sitarama Raju real photos – Unseen Picture

Alluri Sitarama Raju Biography in Telugu

రంప ఉద్యమ వీరుడు అల్లూరి సీతారామ రాజు

Alluri Sitarama Raju Telugu

1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామంలో సూర్యనారాయణమ్మ, వెంకటరామరాజు దపతులకు అల్లూరి సీతారామరాజు జన్మించాడు. సీతారామరాజు పూర్వీకులు మోగల్లు గ్రామానికి చెందిన వారవడం వలన ఆయన జన్మించింది మోగల్లు అని ప్రచారంలో ఉన్నా సీతారామరాజు అమ్మమ్మ గారు నివసించే పాండ్రంగి గ్రామంలోనే జన్మించినట్లు అనేక చర్చల అనంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ కమిటీ నిర్ధారించింది.

ఆంధ్రదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో అల్లూరి సీతారామ రాజు విప్లవోద్యమానికి బీజాలు వేశాడనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో 1922 – 1924 మధ్య సాగిన ఈ ఉద్యమానికి రంప ఉద్యమంగా పేరు. ఉద్యమానికి అల్లూరి సీతారామరాజు నాయకుడుగా వ్యవహరించాడు. 1921 నాటికి దేశంలో జరుగుతున్న సహాయ నిరాకరణోద్యమానికి ఆకర్షితుడైన రాజు హింసా విధానం ద్వారా మాత్రమే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని ప్రగాఢంగా విశ్వసించాడు.

1921 జులైలో విప్లవాలకు కేంద్ర బిందువైన చిట్టాగాంగ్ కు వెళ్లి బెంగాల్ విప్లవ వాదులతో స్వాతంత్ర్య సముపార్జనకు అవసరమైన చర్చలు జరిపాడు. చిట్టాగాంగ్ నుండి తిరిగి వచ్చిన అనంతరం తూర్పు గోదావరి జిల్లాలోని గూడెం పర్వత ప్రాంతాన్ని తాను నిర్వహించబోయే కార్యకలాపాలకు స్థావరంగా మార్చుకున్నాడు. అక్కడి తహసీల్దార్ బాస్టియన్ అమాయక గిరిజనులపై చేసే అక్రమాలు, ముత్తదారీ పద్దతులు, పోడు వ్యవసాయం వల్ల ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ  అసంతృప్తితో జీవనం సాగిస్తూ  దీనస్థితిలో ఉన్న ప్రజలకు అండగా నిలబడి నాయకత్వం వహించి సీతారామరాజు బ్రిటిష్ వ్యతిరేక పోరాటం జరిపాడు.

Alluri Sitarama Raju Story in Telugu Language

విప్లవోద్యమం కొనసాగించడానికి అవసరమైన ఆయుధ సామాగ్రి కొరకు సీతారామరాజు పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం ప్రారంభించాడు. అతడు మొదటగా 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడిని చేసి అక్కడి ఆయుధాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.. సీతారామరాజుకు గాం సోదరులుగా పేర్గాంచిన గాం మల్లు దొర, గాం గంటం దొర నమ్మిన బంట్లుగా ఉండేవారు. వీరి సహకారంతో సీతారామరాజు కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లపై దాడిచేసి అక్కడి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

రామరాజు దాడుల పరిస్థితిని గమనించి ప్రభుత్వం స్కాట్ వార్డ్, హేటర్లను బళ్లారి పోలీసు బలగాలను పంపించింది. ఈ విషయాన్ని తన అనుచరుల ద్వారా తెలుసుకున్న రామరాజు దామనపల్లిఘాట్ వద్ద గల దట్టమైన అటవీప్రాంతం వద్ద కాపుకాసి మెరుపుదాడి చేసి స్కాట్ వార్డ్, హేటర్లతో బాటు మరో నలుగురు పోలీసులను చంపివేయడమే కాకుండా వారివద్ద గల మందుగుండు సామాగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నాడు.

1922 డిసెంబరు 6న పెద్దగడ్డపాలెం ప్రాంతంలో పోలీసులు రాజుపై ఆకస్మికంగా దాడిచేయగా రామరాజు తప్పించుకున్నాడు. తరువాత కొన్నిరోజుల పాటు సీతారామరాజు ఎటువంటి విప్లవ కార్యకలాపాలు సాగించకుండా స్తబ్దంగా ఉండిపోయాడు. 1923 ఏప్రిల్ 18వ తేదీన అన్నవరం పోలీసుస్టేషన్ పై దాడిచేసిన రామరాజు తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాడు. అక్కడి నుంచి రామరాజు శంఖపరం పయనమై వెళ్ళాడు. శంఖవరం ప్రజలు రామరాజుకు ఘనస్వాగతం పలికారు.1923, సెప్టెంబర్ 18న గాం మల్లుదొర పోలీసులకు దొరికాడు.

రామరాజు పోలీస్ స్టేషన్లపై చేస్తున్న దాడుల కారణంగా ప్రభుత్వం పోలీసుస్టేషన్లో ఆయుధాలు లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నది. ఈ సారి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే రామరాజును పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో బ్రిటీష్ ప్రభుత్వం రెండు అస్సాం రైఫిల్స్ దళాలను రప్పించి, రూథర్ ఫర్డ్ ను ప్రత్యేక కమిషనర్ గా నియమించింది. 1924 మే 6న రామరాజుకు అత్యంత సన్నిహితుడైన అగ్గిరాజుగా పేర్గాంచిన పేరిచర్ల సూర్యనారాయణ మద్దేరు వద్ద పోలీసులకు దొరికాడు.

జమేదారు కంచుమీనన్ అత్యంత చాకచక్యంతో 1924 మే 7న రామరాజును బందీగా పట్టుకున్నాడు. రామరాజును కొయ్యూరుకు తీసుకువచ్చి అక్కడ పోలీసులు తూటాలవర్షం కురిపించడంతో అమరుడైనాడు. ఆ సంఘటనానంతరం పోలీసులు రామరాజు అనుచరులను ఒక్కక్కరినీ పట్టుకుని కాల్చిచంపేశారు. 1924 జూన్ నాటికి రంప విప్లవం దాదాపుగా ఆగిపోయింది. రామరాజు వీరత్వానికి ప్రతీకగా కృష్ణదేవీ పేట వద్ద అతడి సమాధి నిర్మించబడింది.

Alluri Sitarama Raju Photo Gallery

Chakali Ilamma Real Lift Story