Jaya Jayahe Telangana Song Lyrics In Telugu

Jaya Jayahe Telangana Song Lyrics In Telugu – Credits to Ande Sri

Jaya Jayahe Telangana Song Lyrics In Telugu

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ – జై జై తెలంగాణ

పొతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ
ఏ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గొలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్
జై తెలంగాణ – జై జై తెలంగాణ….

జానపద జన జీవన జావలీలు జాలువారే
కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం “
జై తెలంగాణ – జై జై తెలంగాణ….

సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువనువున ఖనిజాలే నీ తనువుకు సింగాలం
సహజమైన వన సంపద సక్కనైన పూవుల పొద
సిరులు పండే సారమున్న మాగాణి కరములీయ
జై తెలంగాణ – జై జై తెలంగాణ….

గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి.
జై తెలంగాణ – జై జై తెలంగాణ….