History Of Kaleshwaram Temple

శంభో అంటూ భక్తులు స్మరించినంతనే సంతోషంగా వారి కోర్కెలు తీరుస్తూ భోళా శంకరుడిగా, ఆది యోగిగా పిలువబడే పరమశివుడు కాళేశ్వర ముక్తీశ్వరుడనే పేరుతో కొలువుదీరి భక్తి ముక్తులకు నెలువుగా ఉన్న ఆలయమే కాళేశ్వర దేవాలయం. అత్యంత మహిమాన్వితమైన ఈ దేవాలయం తెలంగాణా రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా మహదేవ్ పూర్ మండలంలో మారుమూల అటవీ ప్రదేశంలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటుగా సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్న త్రివేణీ సంగమ ప్రదేశంలో నెలకొని ఉన్నది. ఇక్కడ గోదావరి నదికి ఒకవైపున కాళేశ్వర ముక్తీశ్వరాలయం మరొక వైపున మహారాష్ట్ర ఉన్నవి. ఇక్కడ స్వయంభువుగా వెలసిన పరమశివుడు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు.

Kaleshwaram Temple History In Telugu

ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి రమణీయతల మధ్య నెలకొని ఉన్న అతి పురాతనమైన ఈ ఆలయం ఒకానొక సమయంలో అరణ్య ప్రాంతంగా ఉండటంతో తగిన రవాణా సౌకర్యాలు లేకపోవడం వలన భక్తులు ఇక్కడికి రావడానికి నానా ఇబ్బందులకు లోనయ్యేవారు. కానీ 1976-82 సంవత్సరాల మధ్య కాలంలో ఆలయ జీర్ణోద్ధరణ జరుగుతున్న సమయంలోనే భక్తుల రాకపోకలకు వీలుగా రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపరిచారు.

ఆలయ నిర్మాణం – Kaleshwaram Temple Construction Details

కాళేశ్వరాలయం సుమారు రెండు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉన్నట్లు చారిత్రక ఆధారాల ప్రకారం తెలుస్తోంది. క్రీ.శ. 892-921 మధ్య కాలంలో తెలంగాణాను పాలించిన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మింపచేసినట్లు చారిత్రక ఆధారాలు కలవు. ఆ తరువాత కాలంలో శిథిలమైన ఆలయాన్ని కాకతీయులు పునరుద్ధరించినట్లు కూడా శాసనాల ద్వారా తెలుస్తున్నది. కాకతీయ ప్రతాపరుద్రడు సువర్ణ తులాభారం చేసుకుని ఆ మొత్తాన్ని శ్రీకాళేశ్వరస్వామికి సమర్పించినట్లు ఆలయ శాసనాలు తెలుపుతున్నవి. లభించిన శాసనాల ఆధారంగా విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆలయ పోషణకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశాడనే విషయం గోచరమవుతున్నది.

Unknown History of Kaleshwaram Temple ఆలయ పురాణగాథ

ఏ దేవతామూర్తి వెలిసినా, ఏ పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందినా దాని వెనక పురాణగాథలు, చారిత్రక సత్యాల పరమార్థం దాగి ఉంటుంది. పూర్వ కాలంలో మహర్షులు, మహా పురుషులు, చక్రవర్తులు ఏ పుణ్యకార్యం చేసినా అది ప్రజోపయోగార్ధమే ఉండేది. సామాన్యులు నమ్మినా, నమ్మకపోయినా ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన సత్యమిది. అదే విధంగా ఈ క్షేత్రం వెనక కూడా కొన్ని పురాణగాథలు కలవు.

Kaleshwaram Temple History with Interesting Facts

పూర్వం ఒకసారి యమధర్మరాజు ఇంద్రలోకం సంచారానికి వెళ్ళినప్పుడు అక్కడి వైభోగాన్ని చూసి, ఇంతటి వైభవోపేతమైన లోకానికి రావడానికేనా భూలోక వాసులంతా పరమశివుణ్ణి ప్రార్ధిస్తున్నారు. అందుకే యమలోకానికి వచ్చేవారు తగ్గిపోయారని ఆలోచించి, ఇంద్రలోకం కన్నా గొప్పదైన నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడట. స్వర్గం కంటే మరింత అందమైన నగరాన్ని నిర్మించాల్సిందిగా విశ్వకర్మను కోరగా, విశ్వకర్మ గోదావరి నది ఒడ్డున అత్యంత వైభవోపేతమైన కాళేశ్వరం నిర్మించాడని, ఆ నగరాన్ని చూసిన శివుడు పరమానందభరితుడై అక్కడ నివాసమేర్పరచుకున్నాడని, యమధర్మరాజుకి కాళుడని మరో పేరు కూడా కలదు కాబట్టి కాలుడి చేత నిర్మించబడి, ఈశ్వరుడు నెలకొని వున్న నగరం కాళేశ్వరంగా మారిందనే పురాణగాధ ఒకటి ప్రచారంలో కలదు.

భూలోకవాసులందరూ శివుడిని సేవించి, పాప రహితులైన వారందరికి ముక్తి ప్రసాదించి స్వర్గలోకాన్ని శివుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి శివుడికి ముక్తేశ్వరుడనే పేరు కూడా వచ్చింది. యమధర్మరాజు తాను అనుకున్నది జరగకపోయే సరికి నేరుగా వెళ్ళి శివుడితో తన బాధ చెప్పుకున్నాడు. “స్వామీ, తమ భక్తులందరికీ ముక్తిని ప్రసాదించి నాలోకానికెవర్నీ రానివ్వటంటేదు ఇప్పుడు నన్నేం చేయమంటారని” అడిగాడట. దానికి పరమశివుడు యమధర్మరాజా నువ్వు కాళేశ్వరం వెళ్ళి ముక్తేశ్వర లింగం వున్న పీఠం పైనే మరొక లింగాన్ని ప్రతిష్టించు. “కాళేశ్వర పుణ్యక్షేత్ర దర్శనార్థం వచ్చిన వారెవరైనా సరే ముందు నీచే ప్రతిష్టింపబడిన లింగాన్ని పూజించి ఆ తరువాత ముక్తీశ్వరుణ్ణి పూజించాల్సి ఉంటుంది. ఒక వేళ అలా దానికి విరుద్ధంగా ఎవరైనా చేస్తే వారికి యమలోక ప్రాప్తి కలుగుతుందని” పరమశివుడు తెలిపాడట. ఈశ్వరాజ్ఞ ప్రకారం కాళేశ్వరం వెళ్ళి అక్కడ ముక్తీశ్వరుడి ప్రక్కన మరొక లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్టించాడు. కాళుడు(యముడు) ప్రతిష్టించిన లింగం కాబట్టి కాళేశ్వరాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి పొందుతున్నదనేది మరొక కథనం.

The Uniqueness Of Kaleshwaram Temple – ఆలయ విశిష్టత

కాళేశ్వర క్షేత్రం, కాశీ క్షేత్రం కంటే గొప్పదని ‘కాళేశ్వర ఖండవలు’ తెలియజేస్తున్నది. అంతేకాకుండా ఈ క్షేత్రం ప్రస్తావన స్కాందపురాణం, గౌతమీపురాణంలో కూడా కలదు. ఈ ఆలయంలో విశాలమైన ప్రాంగణం ఉండి నలుదిక్కులా నాలుగు నంది మూర్తులు ప్రతిష్టించబడి ఉన్నాయి. ఇతర ఆలయాల వలె కాకుండా ఇందులోని గర్భాలయంలో ఏకపీఠం పైన రెండు శివలింగాలు ఉండటమే కాకుండా ముక్తీశ్వర స్వామికి రెండు నాసికా రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాలలో అభిషేక జలం ఎంత పోసినప్పటికీ ఒక్కచుక్క కూడా బయటకు రాకుండా భూమార్గం గుండా ప్రవహించి, సరస్వతీ నది రూపంలో గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుందని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తున్నది.

గర్భాలయంలో ఉన్న రెండు లింగాలలో ఒకటి కాళేశ్వర లింగం కాగా, రెండవది ముక్తేశ్వర లింగంగా చెబుతారు. కాళేశ్వర లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్టించాడు. పరమశివుడు యమధర్మరాజుకు ఇచ్చిన వరప్రభావం కారణంగా, ఈ ఆలయానికి వచ్చిన భక్తులు మొదట కాళేశ్వర లింగాన్ని దర్శించిన తరువాతనే ముక్తీశ్వర లింగాన్ని దర్శించాలనేది అదిగా వస్తున్న ఆచారం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలతో సహా అన్ని రకాల పండుగలు, పర్వదినాలు, కార్తీక మాసంలో ఈ ఆలయం అశేష భక్తజనసంద్రంతో నిండిపోతుంది. ఇటువంటి పర్వదినాల్లో స్వామి వార్లకు మహాన్యాసక రుద్రాభిషేకాలు, అర్చనాది అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో పార్వతీమాత శుభానంద దేవిగా కొలువులందుకుంటుండగా, మరోవైపున జ్ఞాన సరస్వతిగా నీరాజనాలందుకుంటున్న మహా సరస్వతి ఆలయం కలదు. ఆలయం ప్రధాన ద్వారానికి పూర్వభాగంలో సూర్య దేవాలయం కలదు. మరోపక్క విజయ గణపతి నెలకొని ఉన్నాడు. విశాల ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఆలయ ముందుభాగంలో గల కోనేరులో స్నానమాచరించిన వారికి కాశీలోని మణికర్ణికా ఘాట్లో స్నానమాచరించిన ఫలితం కలుగుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాళేశ్వరక్షేత్రంలో జ్ఞానతీర్థం, నరసింహతీర్థం, బ్రహ్మతీర్థం, హనుమత్ తీర్థం, వాయుసతీర్థం, సంగమతీర్థం మొదలైన తీర్థాలున్నాయి. కాళేశ్వర ముక్తీశ్వరాలయానికి పడమర వైపున యమగుండానికి పైన సుమారు ఒక కి.మీ దూరంలో గల ఆదిముక్తీశ్వరాలయానికి చుట్టుపక్కల ప్రకృతిసిద్ధమైన విభూతి రాళ్లు లభిస్తాయి.

యముడు తపస్సు చేసినట్లు తెలియజేసే యమకోణం ప్రధానాలయ ఆవరణలోనే ఉంటుంది. ఇందులో ప్రవేశం చేసే వారికి యమ బాధలుండవని, ముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. కాశీలో మరణం సంభవిస్తే కైలాసప్రాప్తి కలుగుతుందని అక్కడి స్థల పురాణం చెబితే, కాళేశ్వర క్షేత్రంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శనమాత్రం చేతనే కైలాస ప్రాప్తి కలుగుతుందన్నది ఇక్కడి స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది.

Kaleshwaram Temple History In English

Kaleshwara Temple is the temple of Koluvudiri Bhakti Muktis with the name of Paramashiv Kaleshwara Muktiswar who is known as Bhola Shankara and Adi Yogi and fulfills their desires as happily as the devotees remember him as Sambho. This most glorious temple is situated in a remote forest area in Mahadevpur mandal of Karimnagar district in Telangana state at the confluence of Triveni river which flows as an inter-channel with Godavari and Pranahita rivers. Here on one side of the river Godavari is the Kaleswara Muktiswara Temple and on the other side lies Maharashtra. Here Lord Shiva who shines as Swayambhu appears as Sri Kaleshwara Mukteshwara Swami.

Kaleshwaram ancient temple situated in the midst of peaceful environment and natural beauty, was once a forest area and due to lack of adequate transport facilities, devotees used to face many difficulties to reach here. But between the years 1976-82, at the same time that the temple was being renovated, the transportation facilities were also improved to facilitate the movement of devotees.

History of Kaleshwara Temple

According to historical evidence, Kaleswara Temple has a history of more than two thousand years. AD There is historical evidence that the Chalukya Bhima, who ruled Telangana between 892-921 AD, built this temple. It is also known from the inscriptions that the Kakatiyas restored the dilapidated temple in the later period. The inscriptions of the temple state that Kakatiya Prataparudra took a golden weight and presented it to Sri Kaleshwara Swamy. Based on the found inscriptions, it is evident that Vijayanagara Lord Shri Krishna Devarayalu also arranged adequate facilities for the maintenance of the temple.

No matter which deity is worshipped, no matter which shrine is developed, behind it lies the ultimate meaning of legends and historical truths. In earlier times, whatever pious work was done by sages, great men and emperors, it was for the sake of prosperity. Whether the common man believes it or not, it is a truth that everyone should understand. Similarly, there are some legends behind this field.

Once in the past, when Yamadharmaraja went on a journey to Indraloka, seeing the prosperity there, all the inhabitants of the world were praying to Lord Shiva to come to such a glorious world. That’s why he thought that the number of people coming to Yamaloka had decreased and decided to build a city greater than Indraloka. When Vishwakarma was asked to build a city more beautiful than heaven, Vishwakarma built the most glorious Kaleswaram on the banks of the Godavari river, and Shiva, who saw the city, was delighted and settled there. Yamadharmaraja also has another name, Kaluda.

Lord Shiva is also known as Mukteshwar because all the earthlings serve Lord Shiva and grant salvation to all those who are sinless and bless the heavenly world. When Yamadharmaraja didn’t get what he wanted, he went straight and told Lord Shiva about his grief. He asked, “Swami, what do you want me to do now if you grant salvation to all your devotees and let no one come to me?” For that, Lord Yamadharmaraja, go to Kaleswaram and install another linga on the pedestal where Mukteshwara linga is. “Anyone who comes to visit the Kaleswara shrine should first worship the linga installed by you and then worship Muktiswar. If anyone does the opposite, then they will get access to Yamaloka,” said Lord Shiva.

According to Eshwarajna, he went to Kaleswaram and installed another linga next to Muktiswara there by Yamadharmaraja. Another story is that this temple is popularly known as Kaleshwaralaya because it is a lingam installed by Lord Kala (Yamu).

Kaleshwaram Project in Telangana State