Telangana Festivals – తెలంగాణ జాతరలు

  • ఏడుపాయల జాతర
  • నాగోబా జాతర (ఇంద్రవెల్లి)
  • వేలాల జాతర
  • సిద్దులగుట్ట జాతర
  • సమ్మక్క సారక్క జాతర
  • అయినవోలు జాతర
  • కొరివి జాతర
  • నల్లకొండ జాతర
  • కొమురవెల్లి జాతర
  • తుల్జా భవాని జాతర కురుమూర్తి జాతర
  • గద్వాల్ జాతర మల్దగల్ జాతర మన్నెంకొండ జాతర
  • చేవెళ్ల జాతర
  • జోగినాథుని జాతర
  • కేతకి సంగమేశ్వర స్వామి జాతర

కొమురవెల్లి జాతర :

వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం సంవత్సరాది రోజులలో మల్లన్న దేవుని జాతర జరుగుతుంది. దీని వెనుక ఒక స్థల పురాణం ఉంది. ఒక గ్రామంలో కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు – వారికి బలి మేడల దేవి అనే ఆడపడుచు ఉంటారు. వీరు బలిజ కులానికి చెందిన వారు ఒక రోజు మహాదేవుడైన మల్లన్న ఆకాశమార్గంలో పోతుండగా, బలిమేరలలోని మేడపై నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఆమె అన్నదమ్ములు వారం ఆడుతూ ఉండడంతో మల్లన్న కూడా వారితో జూదం ఆడతారు. జూదంలో ఆ అన్నదమ్ములు ఆస్తిపాస్తులను, పోగొట్టుకుంటారు. చివరకు తమ చెల్లిని జూదంలో పణంగా పెట్టి, ఆమెను కూడా ఓడిపోతారు. దీంతో విజేత మ్యాన్న తాను ‘గెలుచుకున్న బలి మేడల దేవుని గుర్రంపై ఎక్కించుకొని పయనమౌతాడు.

హతాశులైన అన్నదమ్ములు మల్లన్నపై కత్తులు – ఆరిసెలు తీసుకొని వెంట పడతారు. ఇది గమనించి మల్లన్న గట్టిగా ఎగశ్వాస పీల్చి తుమ్మాడు. దానితో వెలువడిన గాలికి ఆ అన్నదమ్ములు ఏడు తుమ్మ చెట్ల లాగా మారిపోతారు. మల్లన్న బలి మేడల దేవి ని తీసుకొని వెళుతుండగా చీకటి పడుతుంది. దానితో వారు కొమురవెల్లి గుట్టపై దిగి, గుట్ట మధ్యభాగంలో చూడగా ఒక సొరంగం కనబడుతుంది, ఆ రాత్రి మల్లన్న, బలిమేదలదేవితో అక్కడ గడుపుతారు. తెల్లవారి బలి మేడల దేవి ప్రార్ధించి, తన అన్నలు మనుషులుగా మార్చమని మల్లన్నను వేడుకుంటుంది. ఆమె మాట కాదనలేక తుమ్మచెట్లుగా మారిన అన్నదమ్ములను మనుషులుగా మారుస్తాడు. ఆ తర్వాత తన దివ్య మహిమతో అన్నదమ్ములను రప్పించుకుంటాడు. మెడలో సర్పం తో దర్బంగా మల్లన్న మల్లికార్జునుడై దర్శనమిస్తాడు. ఆనాటి నుండి మల్లన్న జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది.