Kaleshwaram Project Details in Telugu

కాళేశ్వరం ఎత్తిపోతలతెలంగాణ మానసపుత్రిక

తెలంగాణ అతి ముఖ్యమైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం

ఇండియా లోనే కాదు ప్రపంచం లోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం మన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం

ఆసియాలోనే అతి పెద్ద ఎగసిపడే జలాశయం ( సర్జెపూల్ )

గోదావరి నదిపై వరుసగా బ్యారేజీ లను కట్టడం.

తెలంగాణ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అతి పెద్ద ఇంజనీరింగ్ అద్భుతం

తెలంగాణాకి మరియు భారతదేశానికి గర్వకారణం ఐన కాళేశ్వరం యొక్క ప్రాముఖ్యతను మనము గి తెలంగాణవెబ్ అనే దాంట్లో చూసి మొత్తం వివరాలను తెలుసుకుందాం.

కాళేశ్వరం పథకం ను గోదావరి నది పైన భూపాలపల్లి అనే కొత్త జిల్లాలో కాళేశ్వరం దగ్గరా నిర్మిస్తుర్రు. మొదట గి పథకానికి పైసలు 80,000 కోట్లే అనుకుర్రు కానీ ఇది పూర్తిగా ప్రారంభం అయ్యే సమయం అనగా 2020 నాటికీ దగ్గరదగ్గర లక్ష కోట్లు వరకు చేర్తాదని అంచనా , చూద్దాం మల్ల గిట్ల లక్ష కోట్లు దాటుతాదా లేక 80,000 కోట్లకే అయిపోతదా.

దీని ఆయకట్టు 45 వేల ఎకరాలు. సుమారు ఇంచుమించుగా 235 టీఎంసీ ల నీటిని ఎత్తి పోయడమే దీని ముఖ్య లక్ష్యం.

ముందుగా గి పథకం గురించి మాట్లాడుకునే ముందు దీనికి గంత పేరు యెట్లా వచ్చిందో వివరంగా తెలుసుకుందాం.

కాళేశ్వరం పథకం వల్ల వచ్చే ముఖ్యమైన సలువతులు సౌలతులు

మొత్తంగా 45 లక్షల ఎకరాలకు రెండు పంటల చొప్పున నీళ్లు అందించుడే ముఖ్య లక్ష్యం.
ప్రతిరోజు మరియు ప్రతిఇంటికి మంచి తాగునీరు అదించే మిషన్ భగీరథ పథకానికి అవసరం అయిన నీళ్లను అందించడం.
మనరాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది పరిశ్రమలకు గిట్ల పూర్తిగా నీళ్లను ఇవ్వడం.
మరియు మన రాజధాని అయిన హైదరాబాద్ కూడా నీళ్లను ఈ పథకం ద్వారా ఇవ్వచ్చు.
మరియు జలవిద్యుత్తు ను కూడా మస్తుగా ఉత్పత్తి గిట్ల చేయవచ్చు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క రికార్డులు

vభారతదేశంలోనే కాకుండా ప్రపంచం లోనే ఎక్కడ లేని 139 మెగావాట్ల పంపులను ఈ ప్రాజెక్ట్ లో వాడారు.
ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 2 టీఎంసీ ల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎత్తిపోయవచ్చు.

పూర్తి వివరాలు c

ప్రాజెక్ట్ వివరాలు విశేషాలు పూర్తిగా తెలుసుకుందాం

గి ప్రాజెక్ట్ ను మొత్తం 12 బ్లాక్ కులు గ విభజించిర్రు

  • మేడిగడ్డ బ్యారేజీ.
  • మేడారం బ్యారేజీ
  • మేడారం ఎత్తిపోతలు.
  • ఎల్లం పల్లి నుండి నంది మేడారం దగ్గర ఉన్న మేడారం బ్యారేజీ కి నీటిని పంపడం.
  • మూక్యంగ సొరంగ మార్గాన్ని మేడారం రిజర్వాయర్ నుంచి నిర్మించడం.
  • అన్నారం బ్యారేజీ.
  • అన్నారం ఎత్తిపోతలు.
  • పెద్ద పంప్ హౌస్ ను రాగం పేట దగ్గర నిర్మించడం.
  • రంగనాయక సాగర్ వరకు అప్రోచ్ కాలువ ను నిర్మించడం.
  • సుందిళ్ల బ్యారేజీ.
  • సుందిళ్ల ఎత్తిపోతలు.
  • మధ్య మానేరు నుండి ఎగువ మానేరు కు నీటిని తరలించడం.
  • అనంతగిరి రిజర్వాయర్ నుండి అప్రోచ్ కాలువ ను కట్టడం.

జూన్ 21, 2019 రోజున ఈ పథకం ప్రారంభించారు. మొదటగా మేడిగడ్డ దగ్గర పూజలు గిట్ల చేసి, కన్నె పల్లి పెద్ద పంప్ హౌస్ దగ్గర తెలంగాణ ముఖ్యమంత్రి K . చంద్రశేఖర్ రావు , మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లతో ప్రారంభించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ సృష్టిస్తున్న రికార్డు ల వివరాలు.

ప్రపంచం లో ఇంత వరకు ఎవరు ఉపయోగించని 139 మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన మెగా పంపులను ఈ ప్రాజెక్ట్ లో ఉపయోగించడం జరిగింది .

ప్రపంచం లో మరి ఎక్కడ లేని విధంగా 203 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాలు యెక్క ముఖ్య విశిష్టత.

గోదావరి నది నీటిని 92 అడుగుల ఫై నుండి బహుళ దశల్లో అన్ని ఆయకట్టు లకు మరియు చివరికి 618 మీటర్లకు వరకు నీటిని పంపడం కాళేశ్వరం ప్రాజెక్ట్ యెక్క ముఖ్య కర్తవ్యం.

92 మీటర్ల నుండి 618 మీటర్ల వరకు గల బహుళ ఎత్తిపోతల పథకాలపూర్తి వివరాలు.

  • మేడిగడ్డ 92
  • ఎల్లంపల్లి 148
  • మధ్య మానేరు 318
  • శ్రీరామ్ సాగర్ 332. 54
  • మలక్పేట్ 432. 50
  • అనంతగిరి 397
  • రంగనాయక సాగర్. 490
  • మల్లన్న సాగర్. 557
  • కొండా పోచమ్మ సాగర్. 618

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో గ్రావిటీ కాలువల నిర్మాణం కూడా ఒక రికార్డు యే , ఎందుకంటె దాదాపు 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలను నిర్మించారు. ఇది దాదాపు దేశ రాజదాని ఢిల్లీకి మరియు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు మధ్య గల దూరం తో సమానం.

తెలంగాణలో కట్టిన కాళేశ్వరంప్రాజెక్ట్ దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది.చివరికిప్రపంచంలోనే అందరికి తెలిసిన గూగుల్ లో సైతం రికార్డులు కొల్లగొడుతుంది. కావాలంటే గూగుల్ లో worlds biggest LIft irrigation project అని కొట్టి చూడుంర్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తోంది. ఇంతకుముందు వరకు అమెరికా లోని కొలొరాడొ, ఆఫ్రికా ఈజిప్ట్ దేశం లో గల మానవ నిర్మిత ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు పెద్దవిగా ఉండేవి. కానీ కాళేశ్వరం వాటి రికార్డు లను చెరిపివేసి కొత్త రికార్డు లికించింది.