golconda fort history in telugu

Golconda fort History in Telugu – గోల్కొండ కోట

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ కి పశ్చిమాన 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే గి కోట గురించి తెలుసుకోవానంటే మనం దాదాపు 11వ శతాబ్దము లకు పోవాలే. గోల్కొండ గురించి తెలుసుకున్నాక మరి ఎక్కువ ఆశ్చర్య పడకర్రి .

Golconda Fort History in Telugu

గోల్కొండ తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ఆకర్షణలలో ఒకటి, ఇది 800 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. ఈ వారసత్వ నిర్మాణం యొక్క చరిత్ర 12 వ శతాబ్దంలో ప్రారంభమైంది. దక్కన్ పీఠభూమిలో అత్యంత ప్రాచుర్యం మరియు అతిపెద్ద కోట గా గుర్తింపు పొందింది. ఈ కోటలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన వజ్రాల వ్యాపారం కూడా జరిగింది. ముక్యంగా కోహినూర్ వజ్రం అందులో చెప్పుకోదగినది. ఈ కోట ప్రత్యకత ప్రవేశద్వారం దగ్గర చేతులతో చప్పట్లు కొడితే అది కోట పైన ఉన్న రాజు దర్బార్ లో వినపడుతుంది. ఇది ఆ కాలంలో శత్రువుల సమాచారం వేగంగా చేరవేయడానికి చాలా ఉపయోగపడింది. ధ్వని శాస్త్రం ప్రకారం ఈ కట్టడం నిర్మాణం జరిగింది.

Golconda Fort History in English

Golconda fort History in Telugu – ఈ కోట నిర్మాణం కాకతీయ వంశం నుండి ప్రారంభం అయింది. అవి కాకతీయులు పరిపాలిస్తున్న రోజులవి, ఒక గొల్ల కాపరి (గొల్ల వంశానికి చెందిన ఒక వ్యక్తి ) ఈ కొండా మీద నడవంగా ఒక దేవత విగ్రహం కనిపించింది అంట. వెంటనే గీ ముచ్చటను కాకతీయ రాజుకి చేరవేసిర్రు . అయితే గా రాజుకి జరా ఎక్కువనే దైవ భక్తి ఉండుట్ల వెంటనే చైనా చిన్న గుడి మరియు చిన్న మట్టి కోటను కట్టిండు. అయితే గ కోటనే అప్పట్ల గొల్ల కొండా అని పిలిసేటోళ్ళు. రాను రాను ఈ గొల్లకొండ అనేక చేతులు మారి చివరికి కుతుబ్ షాహీ వంశానికి చేరింది. వీళ్ళ వంశ పాలనలో గోల్కొండ కీర్తి ప్రపంచానికి తెలిసింది అని చరిత్రకారుల నమ్మకం. ఏది ఏమైనా ఇటు వంటి అద్భుత కట్టడం ఆ కాలంలో హైదరాబాద్ యొక్క ప్రతిష్టతను మొత్తం భారతదేశానికి తెలిపింది.

అయితే మల్ల మొదలు పెడదామా ఇగ

గోల్కొండ కోట చరిత్ర

గోల్కొండ కోట ను మొదటగా కాకతీయులు పాలించారు. తర్వాత వారి వారసులు అయిన ముసునూరి నాయకులూ చేతిలో పరిపాలన జరిగింది. దాని తర్వాత బహమనిలా ఆధీనంలోకి వెళ్ళింది. ఈ సమయంలో కోటలో అనేక కొత్త కట్టడాలను నిర్మించడం జరిగింది. 1513 వ సంవత్సరంలో కుతుబ్ షాహీ పరిపాలనలోకి వెళ్ళింది. 1518 వ సంవత్సరం లో స్వత్రంత్ర రాజ్యాంగ మొహమ్మద్ గుళి చేసిండు. అప్పటినుండి గోల్కొండ లో అనూహ్యమైన పరిణామాలు మరియు నిర్మాణాలు చోటు చేసుకొన్నాయి. చివరికి మొఘల్ రాజు అయినటువంటి ఓరంగజేబు 8 నెలల పాటూ కష్టపడి వశపరచుకొన్నాడు. దాని తర్వాత అసఫ్ జా ని అధికార ప్రతినిధిగా నియమించి ఢిల్లీ వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకి అసఫ్ జా “నిజాం ఉల్ ముల్క్” అనే బిరుదు పెట్టుకొని నిజాం అనే స్వతంత్ర రాజ్యాన్నఏర్పాటు చేసి గోల్కొండ దాని తదనంతరం హైదరాబాద్ రాజధానిగా పరిపాలన కొనసాగించిండు.

Golconda fort History in Telugu – గోల్కొండ కోట కట్టడం యొక్క వివరాలు

1. ముఖ్యమైన కట్టడాలు
2. ధ్వని సమాచారం ఇచ్చే నిర్మాణం.
“చప్పట్లు కొట్టే మంటపం” ఈ నిర్మాణానికి ఒక ఎత్తు అయిన పైకప్పు ఉంది. దీనికి తెరిచిన కమాన్లు ద్వారాలుగా ఉన్నాయి. ఇక్కడా చప్పట్లు కోటపైన దర్బార్లో ఉన్న వారికీ వినిపిస్తుంది . దీన్ని ధ్వని పరావర్తనం సిద్ధాంతం ఆధారంగా నిర్మించడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి అలాంటి నిర్మాణం ఆ కాలం లో సాధ్యమా. అందువల్లనే మధ్య యుగంలో దక్కన్ పీఠభూమిలో పెద్ద మహాదుర్గము గ ప్రసిద్ధి చెందింది.
2. ద్వారాలు మరియు వాటియొక్క ప్రతిష్ఠత.
3. నీటి సరఫరా
గోల్కొండ కోటలో నీటి సరఫరా ను చాలా అత్యద్భుతంగా నిర్మించడం జరిగింది. స్నానాల బావిలో చల్లటి నీరు మరియు వేడి నీరు వచ్చే మార్గాలను నిర్మించడం జరిగింది ఇవి అన్ని గురుత్వాకర్షణ అనే సూత్రం ద్వారా నిర్మించబడ్డాయి.

4. రహస్య సొరంగం
గోల్కొండ కోటలో రహస్య సొరంగం ఉండేదని ఆనాటి చరిత్రకారులు బలంగా నమ్ముతారు. ఆ సొరంగ మార్గం ద్వారా కొండపైనుండి గోల్కొండ కింది వరకు మరియు హైదరాబాద్ మధ్యలోకి కూడా ఉండేదని వారి నమ్మకం. కానీ ఆ రహస్య మార్గం ఇప్పుడు ఎక్కడా కనిపించదు.

5. 800 ల సంవత్సరాల ఒక చెట్టు

రాణిమహల్ సముదాయం

బాలాహిస్సర్ లో ఉన్న ముఖ్యమైన భవనాలు, చిన్న గదులు, ఇతర నిర్మాణాలు అన్నింటిని కలిపే కట్టడంలో ఇదిప్రధానమైన బహుళ అంతస్తుల భవనమే ఈ రాణిమహల్. ఇది కుతుబ్ షాహీ ల కాలంలో నిర్మించడం జరిగింది.

నక్కర్ ఖానా

రాజా ప్రసాదం లో గల చిన్న చిన్న గదులు , మరియు సమావేశ మందిరములు గల నిర్మాణం. రాజప్రాసాదం లో ఉపయోగియించిన మురికి నీరు ఇక్కడి నుండే బయటకి పోయేది అని ఇటీవల జరిపిన తవ్వకాలలో బయటపడింది.

గోల్కొండ కోట యొక్క రహస్య విషయాలు

గోల్కొండ ను పరిపాలించిన రాజావంశాలు

1.కాకతీయరాజులు
2.ముసునూరి నాయకులూ
3.బహమనీ సుల్తానులు
4.కుతుబ్ షాహీ సుల్తాన్లు
5. హైదరాబాద్ నిజాంలు

గోల్కొండ కోటలో గల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాలు

దక్కన్ పీఠభూమిలో ప్రసిద్ధి చెందిన అతి పెద్ద కోట మన గోల్కొండ కోట. ఈ కోట ను 400 అడుగుల ఎత్తులో లో ఉన్న ఒక కొండ నిర్మించడం జరిగింది. ఈ కోట మూడు అత్యంత పకడ్బందీ గా నిర్మించిన ప్రహరీ గోడలను కలిగి ఉంది. మొదటి ప్రహరీ గోడ 7 కిలోమీటర్ల వ్యాసంలో మరియు 12 మీటర్ల ఎత్తులో శత్రు దురుబెద్ద్యంగా నిర్మించడం జరిగింది.

గోల్కొండ కోట ను కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు చిన్న కోట నుండి బలమైన శత్రుదురుబెద్ద్యం గా నిర్మించండం జరిగింది.