Gond tribe History In Telugu And English

భారతదేశంలో గల అతి పెద్ద గిరిజన తెగలలో గోండు తెగ ఒకటి

Gond Tribe History In Telugu

తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో గోండు జనాభా ఎక్కువగా ఉటారు. వీరిని రాజగోండ్లు అనికూడా పిలుస్తారు. అయితే రాజగోండ్లు గోండు అనే అతి పెద్ద తెగలో ఒక వర్గంవారు మాత్రమే. భారతదేశంలో గల అతి పెద్ద గిరిజన తెగలలో గోండు తెగ ఒకటి. వీరి నివాస ప్రాంతాన్ని గోండ్వానాగా వ్యవహరిస్తారు.

ఐరోపా వాస్తవ్యుడయిన హైమన్ డార్ఫ్  నిజాం కళాశాలలో అధ్యాపకుడుగా ఉన్న సమయంలో అప్పటి నిజాం ప్రభుత్వ అభ్యర్ధన మేరకు 1940లో ఆదిలాబాద్ లో గోండులసి కలిసి నివసిస్తూ వారి సంస్కృతి గురించి విస్తృత అధ్యయానలు చేసి అనేక విషయాలు వెలుగులోకి తెచ్చాడు. గోండులకు సంబంధించిన చరిత్ర, వారి నాగరికత, జరుపుకునే పండుగలు, వివాహాలు, పురాణాలు వంటి విషయాలపై సమగ్ర సమాచారాన్ని హైమన్‌డార్ఫ్ అందించాడు. 

గోండులు తమను తాము గోండీ భాషలో కోయ్ తూర్ లేదా కోయ్ గా పిలుచుకుంటారు. వీరు గోండు భాషతో పాటు మరాఠీ, హిందీ, తెలుగు భాషలలో కూడా మాట్లాడుతారు. పూర్వ కాలంలో గోండులకు ఒక రాజ్యం కూడా ఉండేది. వారే స్వయంగా రాజ్యపాలన నిర్వహించుకునే వారు. గోండులకు సంబంధించి అనేక మంది రాజులు కూడా ఉండేవారు.

వీరి సామాజిక వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా వ్యవస్థీకృతమై ఉంటుంది. నాలుగు సగలుగా విభజింపబడి ఉండే వీరి సమాజంలో ప్రతి సగలో పాడి ఉంటుంది. పాడి అనగా ఇంటి పేరు. వేర్వేరు ఇంటి పేర్లు గల వారికి భాంజాన్ అనబడే పూర్వీకుల ప్రదేశం లేదా వంశం ఉంటుంది. వారి వంశానికి చెందిన దేవతలు అక్కడ ఉంటారనేది వీరి నమ్మకం. తమ వంశ మూలపురుషులు సహితం అక్కడ నివసించేవారని నమ్ముతారు. వీరు వివాహాలు సగ బయటే చేసుకోవాల్సి ఉంటుంది. హిందువులలో ఏ విధంగానైతే ఒకే గోత్రం ఉన్న వారి మధ్య వివాహ సంబంధాలు జరగవో అదే విధంగా ఒకే పాడీకి సంబంధించిన వారు తమమధ్య వివాహ సంబంధాలు చేసుకోరాదనేది వీరి కట్టుబాటు. సాధారణంగా వీరి కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పటికీ వివాహానంతరం చిన్న కుటుంబాలు ఏర్పరచుకోవడం సర్వసాధారణం. గోండుల కుటుంబాల్లో పితృస్వామ్మ వ్యవస్థ ఉంటుంది. బహుభార్యత్వం కూడా కలదు. భర్త చనిపోయిన స్త్రీలు మరిదిని వివాహం చేసుకునే సాంప్రదాయం కూడా కలదు.

వీరికి సంబంధించి అనేక పూజలు, జాతరలు ప్రత్యేకంగా ఉంటాయి. కేశ్లాపూర్ జాతర, జంగుబాయి జాతర; దాండారీ, ఖేల్ పండుగలు ముఖ్యమైనవి. ప్రతి ఏడాది పుష్య బహుళ అమావాస్య నాడు జరిగే నాగోబా జాతర ఇతర గిరిజనులతో పాటు గోండులకు కూడా అత్యంత ముఖ్యమైన జాతర. వీరు పెర్సిపన్ అనే దేవతను ఎక్కువగా పూజిస్తారు. వీరి ఆచారం ప్రకారం ప్రకారం స్త్రీలకు ఆలయ ప్రవేశం లేదు. బయటి నుండే పూజించాలి. వీరు ఇతర గ్రామదేవతలను, పూర్వీకుల ఆత్మలను కూడా పూజిస్తారు. ప్రతి గోండు గూడేం వారికి ‘దేవరి’ అని పిలువబడే పూజారి ఒకరు ఉంటారు. ఇతను గ్రామ పరిపాలనలో కూడా పాలుపంచుకుంటాడు.

గోండుల పంచాయితీ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంటుంది. గ్రామ పెద్దను పటేల్ అని పిలుస్తారు. పూజారి, ఇతర పెద్దమనుషులు కలిసి గ్రామ పరిపాలన చేస్తారు. చిన్న చిన్న గ్రామాలకు ఒక అంతర గ్రామపంచాయితీ ఉంటుంది. గోండులలో మూడు ముఖ్యమైన ఉప తెగలుంటాయి. అవి మరియా, కొండమరియా, బిషోమార్ మరియా. గోండులు స్థిర వ్యవసాయం చేస్తారు. జీవనోపాధి కొరకు అటవీ ఉత్పత్తులపై కూడా ఆధారపడతారు.

Gond Tribe History In English

Adilabad and Kumram Bhim Asifabad districts of Telangana state have the largest population of Gonds. They are also known as Rajagonds. But the Rajagonds are only one section of the largest tribe, the Gonds. The Gond tribe is one of the largest tribal tribes in India. Their living area is called Gondwana.

European realist Hyman Dorf, while he was a lecturer at Nizam College, lived with the Gondulasi in Adilabad in 1940 at the request of the then Nizam’s government and made extensive studies about their culture and brought many things to light. Haimendorff has provided comprehensive information on the history of the Gonds, their civilization, festivals celebrated, marriages, and mythology.

Gonds call themselves Koi Toor or Koi in Gondi language. They also speak Marathi, Hindi and Telugu languages besides Gond. Gonds also had a kingdom in earlier times. They are self-governing. There were also many kings related to the Gonds.

Their social system is highly organized. In their society, which is divided into four halves, each half has a cow. Padi means family name. People with different surnames have an ancestral place or clan called Bhanjan. Their belief is that the deities belonging to their lineage reside there. It is believed that they lived there with their ancestors. They have to get married outside. It is their norm that people belonging to the same padi should not marry each other, just as among Hindus marriages take place between people of the same gotra. Although their family system is usually joint family, it is common to form small families after marriage. Gond families have a patriarchal system. There is also polygamy. There is also a tradition of women remarrying after the death of their husbands.