Skip to content

Ravi Narayana Reddy – A Great Lok sobha Leader

హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించి నిజాం రాజు వెన్నులో వణుకు పుట్టించిన పోరాట యోధుల్లో రావి నారాయణరెడ్డి ప్రముఖుడు. ఉన్నత భూస్వామ్య కుటుంబంలో జన్మించినా పేదప్రజల కష్టసుఖాలలో అనునిత్యం ప్రత్యక్షంగా మమేకమై వారితోనే తన జీవనాన్ని సాగించిన మహోన్నత వ్యక్తి రావినారాయణరెడ్డి.

Ravi Narayana Reddy Biography in Telugu

1908 జూన్ 4వ తేదీన నల్గొండ జిల్లాలోని బొల్లేపల్లి గ్రామంలో రావి నారాయణరెడ్డి జన్మించాడు. హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే గాంధీజీ, జవహర్ లాల్ నెహ్రూ, జయప్రకాశ్ నారాయణ లాంటి జాతీయ నాయకుల రచనలకు ప్రభావితుడై భారత స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. భారత జాతీయోద్యమ కాలంలో 1930లో జరిగిన అత్యంత కీలక ఘట్టమైన ఉప్పు సత్యాగ్రహోద్యమంలో హైదరాబాద్ రాజ్యం నుంచి తెలంగాణ ప్రతినిధిగా ఆయన పాల్గొన్నాడు.

1931వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన హరిజన సేవాసంఘానికి ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించి, రెండు వసతి గృహాలను కూడా నిర్వహించాడు. హరిజన సేవాసంఘం కార్యక్రమాలలో భాగంగా అస్పృశ్యతా నివారణ గురించి ప్రచారం చేస్తూ సహపంక్తి భోజనాలు నిర్వహించి ప్రజలంతా సమామనమని చాటిచెప్పడమే కాకుండా వారిలో విద్యావికాసాన్ని కలిగించే ప్రయత్నం కూడా చేశాడు. .

దేవరకొండలో 1931లో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభ సమావేశానికి తన సహవిద్యార్థులతో కలిసి ఆంద్రోద్యమాన్ని ప్రచారం చేస్తూ హైదరాబాద్ నుంచి దేవరకొండ వరకు పాదయాత్ర నిర్వహించాడు. 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన రావినారాయణ రెడ్డి 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరు వేదికగా జరిగిన ఎనిమిదవ నిజామాంధ్ర మహాసభకు, భువనగిరి వేదికగా 1944లో జరిగిన నిజామాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించాడు. భువనగిరిలో జరిగిన మహాసభ సమావేశంలో అతివాద, మితవాద వర్గాల మధ్య కలిగిన అభిప్రాయ భేదాల కారణంగా ఆంధ్రమహాసభ రెండుగా చీలిపోయింది. ఒకటి జాతీయ మహాసభ కాగా మరొకటి రావినారాయణరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ఆంధ్రమహాసభగా ఏర్పడింది.

1946-48 మధ్య కాలంలో హైదరాబాదు రాజ్యంలో తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా నిజాం పోలీసుల దౌర్జన్యాలను, రజాకార్ల అకృత్యాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా సంచరిస్తూ గెరిల్లా దళాలను సమకూర్చాడు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న నిజాం ప్రభుత్వానికి, దాని అనుయాయులైన భూస్వాములకు, పెత్తందార్లకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడానికి దళాలను సైతం ఏర్పాటు చేసాడు.

భూమి లేని నిరుపేదలకు 200 ఎకరాల తన స్వంత భూమిని దానం చేసి ఉదారతను చాటిన గొప్ప మానవతావాది నారాయణరెడ్డి. ఆయన చేపట్టిన సాయుధ పోరాటానికి భయపడిన నిజాం ప్రభుత్వం 1946లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. నిజాం ప్రభుత్వం తెలంగాణ పోరాటయోధులపై పట్ల విధించిన నిషేధాజ్ఞల కారణంగా ఆయన రాత్రిళ్ళలో మారువేషం ధరించి గ్రామాల్లోని ప్రజలను చైతన్య పరిచేందుకు సమావేశాలు నిర్వహించేవాడు.

1951-52లో స్వాతంత్ర్యానంతరం దేశంలో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పార్టీ అభ్యర్థిగా పోటీచేసి దేశంలోనే అత్యధిక మెజారిటీ పొందిన ఘనత సాధించిన పార్లమెంటు సభ్యుడిగా రికార్డు సృష్టించాడు. 1957లో జరిగిన జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొంది 1962 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడిగా పదవిని నిర్వహించడమే కాకుండా ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగాడు.

అహర్నిశలు పేద ప్రజల కోసం పోరాటాలు చేసి వారి మదిలో చిరస్థాయిగా నిలచిన రావి నారాయణరెడ్డి సెప్టెంబర్ 7, 1991 వ తేదీన తుదిశ్వాస విడిచాడు. ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం మరణానంతరం ఆయనను పద్మభూషణ్ తో సత్కరించింది.

Ravi Narayana Reddy Biography – The Leader of Telangana Armed Struggle

Ravi Narayana Reddy was one of the prominent warriors who started the Telangana armed struggle against the Nizam rule in the state of Hyderabad and made the Nizam king shake his back. Born into an aristocratic family, Ravinarayana Reddy was a great man who lived his life for poor people’s well-being.

Ravi Narayana Reddy was born on June 4, 1908 in the village of Bollepally in the Nalgonda district. While studying Intermediate at Nizam College, Hyderabad, he was fascinated by the writings of national leaders like Gandhiji, Jawaharlal Nehru, and Jayaprakash Narayana and became fascinated with the Indian independence movement.

He represented the Salt Satyagraha, the most important event of the 1930s during the national uprising from Hyderabad in Telangana. As the General Secretary of the Harijan Seva Sangham formed in 1931, he started 100 schools across the state of Hyderabad and also maintained two hostels. As part of the Harijan Seva Sangham’s campaign, he campaigned to prevent untouchability, organized joint lunches to promote equality among the people, and promoted education among them.

He and his classmates marched from Hyderabad to Devarakonda for the Second Andhra Mahasabha Conference in Devarakonda in 1931. Ravi Narayana Reddy, who joined the Communist Party in 1939, presided over the Eighth Nizamandhra Mahasabha held at Chilkur in Nalgonda district in 1941 and the Nizamandhra Mahasabha held at Bhubaneswar in 1944.

The Andhra Mahasabha split in Bhuvanagiri due to differences between the extremist and moderate sections at the Mahasabha meeting; one was the National Congress, and the other was the Communist Andhra Mahasabha under Ravi Narayana Reddy.

During the period 1946-48, as part of the Telangana armed struggle in the Kingdom of Hyderabad, the Nizam mobilized guerrilla forces to roam anonymously to curb police brutality and the atrocities of the Rajakas. The Nizam, who were pursuing anti-people policies, also set up forces to protect the general public against the government, its allies, landlords, and landlords.

Narayana Reddy was a great humanist who donated 200 acres of his own land to the landless poor and spread generosity. The Nizam government banned the Communist Party in 1946 for fear of his armed struggle. Due to the bans imposed by the Nizam government on Telangana militants, Ravi Narayana Reddy used to hold meetings at night in disguise to motivate the people in the villages.

In the first Lok Sabha elections held in the country after independence in 1951-52, he contested as the People’s Democratic Front (PDF) party candidate from the Nalgonda constituency and set a record as the highest votes-achieving Member of Parliament in the country. He contested and won the state assembly elections in 1957 and served as a joint Andhra Pradesh legislator and as leader of the opposition until 1962.

Ravi Narayana Reddy passed away on September 7, 1991. After his death, the government of India honored him with the Padma Bhushan award.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *