Burgula Ramakrishna Rao Biography In Telugu | Hyd State First Chief Minister

నిజాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు సుప్రసిద్ధులు. నిజాం రాష్ట్ర తొలి మరియు చివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే కావడం విశేషం.

రెండు వందల యేడుల నుంచి చిమ్మ
చీకటుల మ్రగ్గి వెలుతురు రేక గనని
మాకు, ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి వీవు,
కీర్తనీయ! బూర్గుల రామకృష్ణరాయ!

`మహాకవి డా. దాశరథి

జననం: పురుగుల రామకృష్ణారావు గారు 1899 మార్చ్ 13 మహాబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గర పడకల్లు గ్రామంలో రంగనాయకమ్మ , నర్సింగారావు దంపతులకు జన్మించారు

బూర్గుల రామకృష్ణారావు ఇంటిపేరు పుల్లెంరాజు. అప్పటి నిజాం రాష్ట్రంలో మహారాష్ట్ర ప్రాంతాలు కూడా కలిసి ఉండటం వల్ల మహారాష్ట్రుల సాంప్రదాయమైన ఊరి పేరుని ఇంటిపేరుగా భావించే పద్ధతిని అనుసరించి రామకృష్ణారావు గారి ఇంటి పేరు బూర్గుల రామకృష్ణారావుగా నిలిచిపోయింది. బూర్గుల రామకృష్ణారావు కు రాధమ్మ తో పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమార్తె ఒక కొడుకు జన్మించాక రాధమ్మ మరణించడంతో అనంతలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు.
బూర్గుల రామకృష్ణారావు ప్రాథమిక విద్యను హైదారాబాద్ లో, బొంబాయి లో మెట్రిక్యూలేషన్, నిజాం కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పుచ్చుకున్నాడు. లా పట్టా పుచ్చుకున్న తర్వాత నిజాం రాష్ట్ర బాధితుల పక్షాన నిలబడి వాదించాడు. భారత మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహ రావు గారు బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు.

Shri B. Ramakrishna Rao, Chief Minister, Hyderabad. – Source: Wikipedia

బూర్గుల రామకృష్ణారావు రాజకీయ ప్రస్థానం

 • ఆంధ్ర కేంద్ర జన సంఘం లో సభ్యులు
 • 1931 లో దేవరకొండలో నిజాం రాష్ట్ర రెండవ ఆంధ్ర మహాసభ సమావేశానికి అధ్యక్షత వహించారు
 • 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా నైజాం ప్రభుత్వం బూర్గుల ను అరెస్ట్ చేసింది.
 • 1939 జనవరి 29 న స్థాపించబడిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించారు.
 • 1950-52 లో ఏర్పాటు అయిన ఎంకే వెల్లోడి మంత్రివర్గంలో రెవెన్యూ, విద్యా, ఎక్సైజ్ మంత్రిగా బూర్గుల రామకృష్ణారావు పనిచేశారు
 • 1951 వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలో రెవెన్యూ మంత్రిగా ఉండి వినోబాభావేకు ప్రోత్సాహం అందించారు
 • 1952లో ఎన్నికల్లో షాద్ నగర్ నుంచి ఎం. ఎల్. ఏ (M.L.A ) గా ఎన్నికై నిజాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు.
 • మంత్రివర్గంలో బూర్గుల రామకృష్ణారావు సమతూకాన్ని పాటించి అన్ని వర్గాలకు స్థానం కల్పించాడు.
 • 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగారు.
 • 1957 -60 లో కేరళ గవర్నర్ పనిచేశారు.
 • 1960-1962 మధ్యలో యూపి గవర్నర్ గా పనిచేశారు.
 • 1962 నుండి 1967 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసాడు.
 • 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు పక్రియలో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం లో తెలంగాణ తరఫున సంతకం చేసిన వారు బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, కే.వి.రంగారెడ్డి,జేబీ నర్సింగ్రావు.
 • ప్రతిష్టాత్మక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు రామకృష్ణారావు హయాంలోని 1955 డిసెంబర్ 10వ తేదీన ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది
 • బుర్గుల రామకృష్ణారావు కృషి ఫలితంగా విద్యారంగంలో ప్రభుత్వం సంస్కరణ చేపట్టి ఏడవ తరగతి వరకు బేసిక్ విద్యను ప్రవేశపెట్టి, దేశంలో బేసిక్ విద్యను ఏడవ తరగతి వరకు ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం ఖ్యాతి గడించింది.
 • 1952 నుంచి 1956 వరకు దాదాపు నాలుగు సంవత్సరాలు బూర్గుల రామృష్ణారావు పరిపాలన కాలంలో ఆయన ప్రవేశపెట్టిన భూసంస్కరణలు, ముల్కీ నిబంధనల అమలు, ఆదేశాలు ఆయనకు అపార కీర్తిని సంపాదించిపెట్టాయి.

బూర్గుల రామకృష్ణారావు బహు భాషా కోవిదుడు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, పార్సి, మరియు, ఇంగ్లీష్ మొదలైన భాషల్లో పండితుడు. అనేక భాషల్లో పలు రచనలు కూడా చేశారు.

 • 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అయనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవపట్టాను ప్రదానం చేసింది.
 • 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లాస్ అనే పట్టాను ఇచ్చింది.

రాజకీయాల్లో తలమునకలై ఉన్న సాహిత్యం లో మంచి అభిరుచి కలిగి ఉండేవారు. బూర్గుల రామకృష్ణారావు రచనలు ఆయన అభిరుచికి అద్దం పడతాయి.

బూర్గుల రామకృష్ణారావు రచనలు – Novels

 • తెలుగు సాహిత్యంలో ప్రాచీనయుగ కర్తలు
 • శ్రీ కృష్ణ శతకం (దీనిలో మనుషులలో గల చిట్టా వంచల్యాన్ని తెలిపారు)
 • తొలిచుక్క
 • కర్మకంకణం
 • పండిత రాజ పంచామృతం
 • కనకధారస్స్తవం
 • నర్మద్ గీతాలు
 • సారస్వత వ్యాస ముక్తావళి (ఈ రచనలో రెడ్డి సామజిక వర్గం యొక్క మత, సాంఘిక పరిస్థితులను మరియు అప్పకవి తెలంగాణ వాడు అని చెప్పాడు.)
 • శారదా స్తుతి
 • పుష్పాంజలి
 • నివేదన
 • శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం (దీనిని శ్రీ వైష్ణవ మతం వారు 1958 లో ప్రచురించారు)
 • అశ్వద్ధామ భారతం
 • ఉర్దూ రచనలు అయినట్టు వంటి ఉమర్ ఖయుం రూబాయలను తెలుగులోకి అనువదించాడు
 • ఫిరదౌసి కవిని తెలుగులో తిక్కన తో పోల్చాడు.
 • చాలా పీఠికలు కూడా రాయడం జరిగింది.

బురుగుల రామకృష్ణారావు గారు 1967 సెప్టెంబర్ 15న హైదరాబాదులో మరణించారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 1957 వ సంవత్సరంలో మరణిస్తే ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు, కానీ హైదరాబాద్ రాష్ట్ర తోలి ముఖ్యమంత్రి మరణిస్తే ఆయనకు ఈ విధమైన లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు. ఇది తెలంగాణ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెల్పించింది.