Bhagyareddy Varma – ఆదిహిందూ వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ
BhagyaReddy Varma in Telugu
హైదరాబాద్ రాజ్యంలో అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ దళితులను ఆదిహిందువులుగా గుర్తించాలని పోరాటం చేసినవారిలో భాగ్యరెడ్డి వర్మ ముఖ్యులు. 1888, మే 22వ తేదీన మాదరి వెకయ్య, రంగమాంబ దంపతులకు హైదరాబాద్ నగరంలో భాగ్యరెడ్డివర్మ జన్మించారు. భాగ్యరెడ్డి వర్మ మొదటి పేరు మాదరి బాగయ్య. ఆరు నెల వయస్సున్నప్పుడు వారి కుటుంబ గురువు ఆయన పేరును భాగ్యరెడ్డిగా మార్చాడు. భాగ్యరెడ్డి చేసిన సేవలకు గాను 1913లో ఆర్యసమాజం వర్మ అనే బిరుదును ప్రదానం చేసింది. ఆ విధంగా కాలక్రమాన బాగయ్య పేరు భాగ్యరెడ్డివర్మగా మారింది.
హైదరాబాద్ రాజ్యంలో దళిత ఉద్యమానికి పునాది వేసి సమాజంలో నిమ్నవర్గాలుగా ఉన్న దళితుల హక్కుల కోసం భాగ్యరెడ్డివర్మ పోరాడారు. దళితుల హక్కుల కోసం ఆది హిందూ ఉద్యమాన్ని ప్రారంభించారు. దళితులు మూలవాసులని, వీరికి ఆది హిందువులని భాగ్యవర్మ పేరు పెట్టి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న దళితులను ఆది హిందువులుగా పేర్కొన్నారు.
భాగ్యరెడ్డివర్మ 1906లో అస్పృశ్యతా నిర్మూలన ఉద్యమాన్ని ప్రారంభించి ‘జగన్ మిత్రమండలి’ అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సభ్యులు అస్పృశ్యత నిర్మూలన కోసం పనిచేశారు. హరికథలు, భజనలు, బహిరంగ సభల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ సంస్థ కృషి చేసింది. అంటరాని కులాల్లో ఆత్మగౌరవం పెంచడానికి విద్యనే పరిష్కార మార్గమని గ్రహించిన భాగ్యరెడ్డి వర్మ జగన్ మిత్రమండలి కార్యక్రమాల్లో భాగంగా 1910లో ఇసామియా బజారులో, లింగం పల్లిలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల్లో బాలికల కోసం సుమారుగా 26 ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు. తరువాతి కాలంలో ఆ పాఠశాలల నిర్వహణ బాధ్యత నిజాం ప్రభుత్వం తీసుకున్నది. 1911లో మన్యసంఘాన్ని ఏర్పాటు చేశాడు. 1913లో దీనిని ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ గా మార్చడం జరిగింది. ఈ
సంస్థలో అగ్రవర్ణాల వారిని చేర్పించి, ఆది హిందువుల అభివృద్ధికి తొడ్పడ్డారు.
1912లో భాగ్యరెడ్డి వర్మ ‘అహింసా సమాజాన్ని’ ప్రారంభించారు. అనంతర కాలంలో ఇదే సంస్థ ‘ది దక్కన్ హ్యూమనిటేరియన్ లీగ్’గా రూపాంతరం చెందింది. ఈ సంస్థ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ప్రచారం ప్రభావం వలన గోవధను నిషేధించడం జరిగింది. 1912లో భాగ్యరెడ్డివర్మ ఒక స్వస్తిక్ వాలంటీర్ల దళ్ ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సభ్యులు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకు పలు రకాల సేవలు చేశారు. హైదరాబాద్లో ప్లేగువ్యాధి వచ్చినప్పుడు ఈ సంస్థ సభ్యులు రోగులకు సేవలు అందించారు.
1913లో హిందూమతాన్ని త్యజించి బౌద్ధమతాన్ని స్వీకరించి ప్రతి ఏటా బౌద్ధ పౌర్ణమి రోజున బుద్ధజయంతి జరపడం ఆనవాయితీగా చేసుకున్నారు. 1915లో ‘సంఘ సంస్కార నాటక మండలి’ని భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించారు. ఈ సంస్థ సాంఘిక దురాచారాలను విమర్శించే మూడు నాటకాలను ప్రచురించింది. 1917 నాటికి అంటరాని వర్గాల సమస్యల పట్ల పూర్తి అవగాహన పెంచుకున్న భాగ్యరెడ్డి వర్మ నవంబర్ 4-6 తేదీల్లో విజయవాడలో ‘మొదటి పంచమ సదస్సు’ ఏర్పాటు చేసి అందులో ‘పంచమ’ శబ్దాన్ని ఖండించారు. అగ్రకుల హిందూ ప్రయోజనాల కోసం ప్రభుత్వం అంటరాని వర్గాలకు ‘పంచమ’ అనే పేరు ఇచ్చిందని, వీరిని రాష్ట్రస్థాయిలో ‘ఆది ఆంధ్రులు’గా జాతీయ స్థాయిలో ‘ఆది హిందువులు’గా పిలవాలని ప్రతిపాదించారు. భాగ్యరెడ్డివర్మ 1921లో ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్య ఏర్పాటు చేశారు. ఆయన మొదటి ఆది హిందూ సదస్సును హైదరాబాద్ లో 1921లో నిర్వహించారు.
1931లో వర్మ ‘భాగ్యనగర్’ అనే పత్రికను ప్రారంభించారు. 1937 డిసెంబర్ నుండి ఈ పత్రిక ‘ఆదిహిందూ’గా పేరు మార్పు చేయబడి మాస పత్రికగా వెలువడసాగింది. 1920 నుంచి అఖిల భారత ఆదిహిందూ సదస్సులు జరిగాయి. 1927, 1930లలో అలహాబాద్ లో జరిగిన ఆది హిందూ సదస్సుల్లో భాగ్యరెడ్డివర్మ దక్షిణ భారతావనికి ప్రాతినిధ్యం వహించారు. 1931లో లక్నోలో జరిగిన ప్రత్యేక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సదస్సులోనే ఆయన తన పేరులోని వర్మ పదాన్ని తొలగించుకున్నారు.
1933లో ఆది హిందూ సదస్సుకు భాగ్యరెడ్డి వర్మడ అధ్యక్షత వహించారు. ఒక మహోన్నత ఉద్యమానికి శ్రీకారం చుట్టిన భాగ్యరెడ్డి వర్మ అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి 18, 1939వ తేదీన మరణించడం ఆది హిందూ ఉద్యమానికి మాత్రమే కాకుండా దళిత జాతికంతటికీ తీరని లోటుగా నిలిచింది.
Bhagya Reddy Varma story in English
Bhagyareddy Varma was one of the leaders who condemned the injustice done to the oppressed sections in the Hyderabad kingdom and fought for the recognition of Dalits as Adi Hindus. Bhagyareddy Varma was born on May 22, 1888, in the city of Hyderabad to the model Venkaiah and Rangamamba. Bhagyareddy Varma’s first name was Madari Bagayya. At the age of six months, their family teacher changed his name to Bhagyareddy. In 1913, the Arya Samaj conferred the title of Varma on Bhagyareddy for his services. Thus over time, the name of Bagayya became Bhagyareddy Varma.
Bhagyareddy Varma laid the foundation for the Dalit movement in the Kingdom of Hyderabad and fought for the rights of the lower castes in the society. He started the Adi Hindu movement for the rights of Dalits. Bhagyavarma named the Dalits as “Adi Hindus” in the state of Hyderabad.
Bhagyareddy Varma started the movement for the abolition of untouchability in 1906 and formed an organization called ‘Jagan Mitra Mandali’. The members of this organization worked for the elimination of untouchability. The organization strives to create awareness among the people through harikathas, bhajans, and public meetings. Bhagyareddy Varma, realizing that education was the solution to increasing self-esteem among the untouchable castes, started primary schools in 1910 at Isamia Bazar and Lingampalli as part of the “Jagan Mithra Mandali” programs. About 26 primary schools for girls have been set up in the Hyderabad-Secunderabad twin cities. The Nizam government later took over the management of those schools.
In 1911 he formed the Manyasangha, and in 1913 it was renamed the Adi Hindu Social Service League. This league contributed to the development of the Adi Hindus by including the upper castes in the organization. Bhagyareddy Varma started the ‘Non-Violence Society’ in 1912. The organization was later transformed into The Deccan Humanitarian League. Govadha (killing cows) was banned due to various campaigns undertaken by the organization.
In 1912 Bhagya Reddy Varma formed a Swastik Volunteer Force. The members of this organization participated in many activities and provided various services to the public, and provided services to the plague patients in Hyderabad. In 1913, the Swastik Volunteer Force members converted from Hinduism to Buddhism; they celebrate Buddha Jayanti every year on the Buddhist full moon day. Bhagyareddy Varma started the ‘Sangha Sanskara Nataka Mandali’ in 1915. The organization has published three novels of critical social evils.
Bhagyareddy Varma, who had a full understanding of the problems of the untouchables by 1917, organized the ‘First Panchama Sadassu’ in Vijayawada on November 4-6 and condemned the word ‘Panchama’ in it. The government named the untouchables ‘Panchama’ for the interests of the Agrakhas (upper caste); He proposed that they should be called ‘Adi Andhras’ at the state level and ‘Adi Hindus’ at the national level.
Bhagyareddy Varma founded the Adi Hindu Social Service Federation in 1921, and he organized the first Adi Hindu Conference in Hyderabad in 1921. In 1931, Varma started a magazine called ‘Bhagyanagar.’ From December 1937, the magazine was renamed ‘Adi Hindu’ and became a monthly magazine.
All India Adi Hindu conferences have been held since 1920. Bhagya Reddy Varma represented South India at the Adi Hindu conferences in Allahabad in 1927 and 1930. He presided over a special meeting in Lucknow in 1931, and it was during this conference, he removed the word Varma from his name. Bhagyareddy Varma presided over the Adi Hindu Conference in 1933. The death of Bhagyareddy Varma on February 18, 1939, due to ill health, was a great loss to the Adi Hindu movement and the Dalit across the country.