suddala hanumanthu

Suddala Hanumanthu – A Great Indian Poet

Suddala Hanumanthu – తెలంగాణ సాయుధ పోరాటానికి కలాన్ని, గళాన్ని అందించిన కవి సుద్దాల హనుమంతు

Suddala Hanumanthu Story In Telugu

తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన కలాన్నే ఆయుధంగా వాడి ప్రజా చైతన్యం కలగడానికి దోహదపడిన ప్రజలకవి, కళాకారుడు సుద్దాల హనుమంతు. జూన్ 6, 1908వ తేదీన నల్గొండ జిల్లాలోని పాలడుగు గ్రామంలో హనుమంతు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, బుచ్చిరాములు. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన కళా వారసత్వం మరియు అంజయ్య నాటక బృందం ప్రోత్సాహంతో హనుమంతు కళాకారుడిగా గుర్తింపు పొంది బాల్యం నుండే నాటకాల ప్రదర్శనల్లో పాల్గొంటూ ప్రజలను చైతన్యవంతులను చేయడం మొదలుపెట్టాడు. ఒకవైపు పాటల రచన చేస్తూనే మరొక వైపు గాత్రం ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ కవిగా, కళాకారుడిగా మాత్రమే కాకుండా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, సాయుధ పోరాట ఉద్యమ నేతగా కూడా హనుమంతు వ్యవహరించాడు.

ఈయన రచనలన్నీ వెట్టి చాకిరి, భూస్వాములు, స్వేచ్ఛ, సమానత్వం, కమ్యూనిజంకి సంబంధించినవే. హన్మంతు రచనలు ప్రజలను తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనేలా ప్రభావితం చేశాయి.

Suddala Hanumanthu story in telugu and english
Suddala Hanumanthu – A Great Revolutionary Poet

బాల్యం నుండి కూడా పట్వారీల, భూస్వాముల, రజాకార్ల అమానుష దమనకాండలను చూస్తూ వెట్టిచాకిరి వేదనలో హనుమంతు బాల్యం గడపడం వలన అణిచివేత ధోరణికి, అన్యాయాలకు, అక్రమాలకు ఎదురొడ్డే తత్వాన్ని అలవాటు చేసుకున్నాడు. ఇవన్నీ గలగలిసి చివరికి ఆయన మనసులో నిజాం వ్యతిరేక భావజాలం విపరీతంగా పెరిగిపోయింది. హనుమంతుకు విద్య అంతగా లేకపోయినా కూడా వీధిబడిలో ఉర్దూ, తెలుగు భాషలు నేర్చాడు. శతకాలు, కీర్తనలు, పద్యాలు కంఠతా వచ్చేవి.

చిన్నతనంలో ఆయనకు గల యక్షగానాలు, కీర్తనలు, భజనల వంటి కళారూపాలలో గల ఆసక్తి కారణంగా యక్షగాన పాత్రధారిగా మారాడు. నిజాం రాజ్యంలో జరిగిన దౌరజ్జన్యాలను, భూస్వాముల, దొరల దమనకాండలను బురక్షథల ద్వారా ప్రజలకు తెలియజేసాడు.

నిజాం రాజ్యంలో ఎక్కువమంది ప్రజలు నిరక్షరాస్యులవడం వలన వారిని జాగృత పరచడానికి ప్రజా కళారూపాలే సరియైన వేదికలని గ్రహించిన హనుమంతు విచిత్ర వేషధారణలైన బుడబుక్కలు, లత్కోరుసాబ్, ఫకీరు వేషం, గొల్లసుద్దులు వంటి కళా రూపాలనుపయోగించి తెలంగాణ సాయుధ పోరాట లక్ష్యాలు, హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమ ఆశయం, వెట్టిచాకిరి నిర్మూలనావశ్యకత మొదలైన అంశాలపై విస్తృత ప్రచారం చేశాడు. మాభూమి చిత్రంలో చిత్రించబడిన ‘పల్లెటూరి పిల్లగాడా’ అనే పాట సుద్దాల హనుమంతు కరుణ రసాత్మకతను, కళాత్మకతను తెలియజేస్తుంది.

నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న శ్రమ దోపిడీని, పేదరికాన్ని, వెట్టిచాకిరీ కారణంగా అమూల్యమైన బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారుల దీనావస్థను ఈ పాటద్వారా లోకానికి చాటి చెప్పాడు. కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరిన హనుమంతు తన గళం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచాడు. భువనగిరిలో జరిగిన పదకొండవవ ఆంధ్ర మహాసభకు వాలంటీర్ గా కూడా పనిచేశాడు.

తెలంగాణ జానపద బాణీలను పాటల్లో కుదించిన అసలు సిసలు ప్రజాకవిగా హనుమంతుకు ప్రత్యేకత కలదు. హైదరాబాద్ లో గల వ్యవసాయ శాఖలో గుమస్తాగా చేరిన హనుమంతు ఉద్యోగ విధుల్లో భాగంగా ఆగ్రా, ఢిల్లీ, ఔరంగబాద్, మద్రాస్ నగరాల సందర్శన ద్వారా ఆర్యసమాజ్ ప్రేరణతో 1930లో యదార్థ భజనమాల అనే పద్యగేయ సంకలనం వెలువరించాడు.

హనుమంతు రచించిన పాటల్లో ఎక్కువగా ప్రచుర్యం పొందినవి పల్లెటూరి పిల్లగాడ (మాభూమి), కన్నులో భగా భగా కడ్పుల్లో ధడా ధడా, ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, భళిరె తెలంగాణ వహరె తెలంగాణ,రణభేరి మ్రోగింది తెలుగోడ, వేయ్ వేయ్ దెబ్బ మొదలైనవి. సాహితీ సర్కిల్ వారు ఆయన రచించిన 22 పాటలను ముద్రణారూపానికి తీసుకునివచ్చారు.

పీడితజనాల ఆర్తనాదాలకు తన భావజాలాన్ని జోడించి తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమానికి వలంటీర్ గా అనేక ప్రజాపోరాటాలకు కలాన్ని, గళాన్ని అందించిన సుద్దాల హనుమంతు 10 అక్టోబర్, 1982వ తేదీన అస్తమించాడు.

Read Veera Telangana book in Telugu – written by the great lyricist Suddala Ashok Teja

https://telanganaweb.com/wp-content/uploads/2022/01/VeeraTelangana.pdf

Suddala Hanumanthu in English

Suddala Hanumanthu was a popular poet and artist who used his art as a weapon during the Telangana armed struggle to create public awareness. Hanumanthu was born to Lakshminarasamma and Buchiramulu on June 6, 1908 in the village of Paladugu in Nalgonda district. Encouraged by his parents’ artistic heritage and the Anjayya drama troupe, Hanumanthu became an artist and motivated people by participating in drama performances from an early age.

Hanumanthu was a poet, artist, and communist party secretary, and leader of the armed struggle movement, inspiring the people by composing songs on the one hand and his voice on the other. All his writings are about slavery, landlords, freedom, equality, communism. Hanmanthu’s writings influenced the people to take part in the Telangana armed struggle.

Seeing the inhuman oppression of Patwaris, landlords, and rajakas even from childhood, Hanumanthu became accustomed to fighting against the philosophy of confrontation, oppression, and injustice. After all this, the anti-Nizam ideology in his mind grew tremendously. Although Hanumanthu did not have much education, he learned Urdu and Telugu on the streets. As a child, he became a yakshagana character due to his interest in art forms such as yakshaganas, kirtans, and bhajans. He used to inform the people about the atrocities and oppression of the landlords that took place in the Nizam kingdom through his Burrakathas.

Realizing that public art forms were the right platform to awaken most of the people in the Nizam’s kingdom who were illiterate, Hanumanthu campaigned for the liberation of Telangana. He used extravagant costumes such as bubbles, latkorusab, fakir dress, and gollasuddulu to spread the word about the goals of the Telangana armed struggle.

The song ‘Palleturi Pillagada’ depicted in the film Mabhumi conveys Suddala Hanuman’s compassion and artistry. Through this song, he told the world about the exploitation of labor, poverty, and the plight of children who are losing their precious childhood under the Nizam’s rule. Hanumanthu, who joined the Communist Party as a member, excited the people through his cell. He also volunteered for the Eleventh Andhra Mahasabha in Bhuvanagiri.

Hanumanthu was a unique and original public poet who composed Telangana folk songs. He joined the Agriculture Department in Hyderabad as a clerk. During that time, he was inspired by Arya Samaj’s tour of Agra, Delhi, Aurangabad, and Madras and published a collection of poems called Yadartha Bhajanamala in 1930.

The most popular songs written by Hanumanthu were Palleturi Pillagada (Mabhumi), Kannulo Bhaga Bhaga Kadpullo Dhada Dhada, Praja Prabhutvam, Bhalire Telangana Vahare Telangana, Ranabheri Mrogindi Telugoda, Vei Vei Debba, etc. Sahitya Circle has brought 22 songs written by him to print. Suddala Hanumanthu, who added his ideology to the cries of the oppressed and volunteered for the Telangana Armed Struggle Movement and provided the impetus for many popular struggles, passed away on October 10, 1982.