Skip to content

Jagityal Jaitra Yatra – జగిత్యాల జైత్రయాత్ర 1978 సెప్టెంబర్ 7

Jagityal Jaitra Yatra

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు సంబంధించిన ప్రస్తావన వస్తే ‘జగిత్యాల జైత్రయాత్ర’ గుర్తుకు తెచ్చుకోవల్సిందే. ఈ ప్రాంతంలో విప్లవోద్యమాలకు ఆ జైత్రయాత్రే నాంది పలికింది. ఎలాంటి సమాచార వ్యవస్థలు అందుబాటులో లేని కాలంలో, కేవలం మాటల ద్వారా విషయం తెలుసుకొని లక్షలాది మంది ఒకే చోటుకు చేరిన రోజు. సరిగ్గా 1978 సెప్టెంబర్ 9న రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయింది. 

Facts About Jagityal Jaitra Yatra 

  • ఆ రోజు ఎటు చూసినా జనమే కనపడ్డారు. ఊరుఊరంతా ఎర్రని జెండాలతో రెపరెపలాడింది. జననాట్య మండలి కళాకారుల విప్లవ గీతాలు, నినాదాలతో నలుదిక్కులు మార్మోగిపోయాయి.
  • భూస్వాములు మరియూ పోలీసుల దౌర్జన్యం నశించాలి.  భూస్వాముల హామీ వ్యవస్థ రూపుమాపాలి వంటి నినాదాలతో జగిత్యాల పట్టణం దద్దరిల్లింది
  • వేలాది జనం భూస్వామ్య వ్యవస్థ మీద విరుచుకుపడ్డ తీరు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో లక్షలాది మందితో జరిగిన భారీ బహిరంగ సభ అది. 

జగిత్యాల పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 1978 సెప్టెంబర్ 7న చుట్టుముట్టు ఉన్న 150 గ్రామాల నుంచి కాలినడకన గొంగిడి భుజాన వేసుకొని సద్ది మూట పట్టుకొని దాదాపు  35 వేల మందికి పైగా ప్రజలు జగిత్యాల సభకు తరలివచ్చారు.  చుట్టూ చాలా పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ RSU కార్యకర్తలు మరియు రైతు కూలీలు, హై స్కూల్ విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

ఈ సభను ఆంధ్రభూమి పత్రిక చారిత్రాత్మకమైన సంఘటనగా వర్ణించింది ఈ జగిత్యాల సభ విజయవంతం కావడానికి నారదాసు లక్ష్మణరావు అల్లం నారాయణ ప్రముఖ పాత్ర పోషించారు ఇంకా రైతు కూలీ సంఘం అధ్యక్షుడు గంజి రామారావు విరసం అధ్యక్షుడు వరవర్రావు జననాట్యమండలి నాయకులు గద్దర్ ఈ వేదిక నుంచి ప్రసంగించారు. 

ఈ సభ ఆదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లాలను చైతన్యవంతం చేయడంలో కూడా ప్రముఖ పాత్ర పోషించింది. 

1977 సెప్టెంబర్ 9న జగిత్యాలలో జరిగిన రైతు కూలీల లాంగ్ మార్చ్ తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆ రోజు, కేవలం మాటల ద్వారా సమాచారం అందుకున్న గ్రామాల్లోని ప్రజలు జగిత్యాలకు పోటెత్తారు. ఈ లాంగ్ మార్చ్‌తో జగిత్యాల దద్దరిల్లింది.

లాంగ్ మార్చ్‌లో పాల్గొన్న రైతు కూలీలు ఆనాటి సభలో ముప్పాళ్ల లక్ష్మణరావు, మల్లోజుల కోటేశ్వరరావు, నల్లా ఆదిరెడ్డి, వరవరరావు, పోరెడ్డి వెంకటరెడ్డి తదితర ప్రముఖ మావోయిస్టు నాయకుల ప్రసంగాలతో విప్లవ స్పూర్తిని రగిలించారు. ఈ సభను అన్ని పత్రికలు విస్తృతంగా కవర్ చేశాయి. పత్రికలే ఈ సభను ‘జగిత్యాల జైత్రయాత్ర’గా పేర్కొనడంతో ఈ పేరు చరిత్రలో నిలిచిపోయింది.

జగిత్యాల జైత్రయాత్ర అనేది తెలంగాణలోని రైతు కూలీ సంఘాల ఉద్యమానికి ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది 1977లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో జరిగింది. ఈ జైత్రయాత్ర ద్వారా రైతు కూలీ సంఘాలు ఏర్పడి, ఈ సంఘాలు క్రమంగా పీపుల్స్ వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందాయి.

ఈ జైత్రయాత్రలో ప్రముఖ మావోయిస్టు నాయకులు ముప్పాల లక్ష్మణ్‌రావు, శీలం నరేశ్‌, లలిత, మల్లోజుల కోటేశ్వర్‌రావు, మల్లా రాజిరెడ్డి, సాహు, నల్లా ఆదిడ్డి, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, పోశాలు, అంగ ఓదెలు, నారదాసు లక్ష్మణ్‌రావు, గద్దర్, అల్లం నారాయణతోపాటు పలువురు పాల్గొన్నారు. వారు తమ ప్రసంగాలతో ప్రజల్ని ఉత్తేజపరిచారు.

జైత్రయాత్ర నిర్వాహకుల్లో కొందరు ఎన్‌కౌంటర్‌‌లో మృతి చెందారు. మరికొందరు లొంగిపోయారు. ఇంకొందరు అడవి బాట పట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *