Chief Minister Breakfast Scheme in Telangana

Chief Minister Breakfast Scheme In Telangana

The Telangana government initiated a distinctive program for students in government schools, offering them breakfast before the commencement of the school day. 

IT Minister KT Rama Rao officially launched the scheme at West Marredpally Government School in Secunderabad, joining students for breakfast. It would be extended to all the government-run schools, for students of classes 1 to 10

The initiative is set to benefit 23 lakh students across 27,147 schools. Students will be provided with a nutritious breakfast, featuring options like idli with sambar, puri with kurma, upma, poha, pongal, or vegetable pulao.

Chief Minister Breakfast Scheme Menu In Telangana

  • Monday – Idly with Sambar or Upma with Chutney
  • Tuesday – Poori with Aloo Kurma or Tomato Bath with Chutney
  • Wednesday – Upma with Sambar Or Khichdi with Chutney
  • Thursday – Millet Idli with Samber or Pongal with Sambar
  • Friday – Uggani or Poha or Millet Idli with Chutney or Upma with Chutney
  • Saturday – Pongal with Sambar or Vegetable Pulao with Raitha or Aloo Kurma

ముఖ్యమంత్రి అల్పాహార పథకం

సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మరో వినూత్న పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో మరియు విద్యార్థుల సంక్షేమాన్ని పెంపొందించడంలో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి విద్యార్థుల సంక్షేమం కోసం మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.

దసరా పండుగ సందర్భంగా, 2023 అక్టోబర్ 24 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న అన్ని విద్యార్థులకు “ముఖ్యమంత్రి అల్పాహార పథకం” (CM-Breakfast Scheme)ను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు మంచి బోధనతో పాటు పోషకమైన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం వల్ల వారి చదువు పట్ల ఆసక్తి పెరిగి, మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

2023 అక్టోబర్ 24 వ రోజున సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. 

ప్రభుత్వం విడుదల చేసిన మెను ప్రకారం, రెండు బ్రేక్‌ఫాస్ట్ ఎంపికలు రూపొందించబడ్డాయి, ఇందులో ఇడ్లీ, సాంబార్, పొంగల్, పూరి, ఉప్మా, వెజిటేబుల్ పులావ్ మరియు గోధుమ ఉప్మా వంటి కలయికలు ఉన్నాయి, అలాగే సాంబార్ మరియు చట్నీలతో వీటితో వడ్డిస్తారు.

ఈ పథకానికి గల కారణం

ఉదయాన్నే వ్యవసాయం పనులు, కూలీపనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం మానవీయ ఆలోచనకు అద్దంపట్టే దిశగా ఈ అల్పాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి అమలు చేయనున్నది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. కాగా, తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాన్ని పరిశీలించి రావాలని ఐఏఎస్ అధికారుల బృందాన్ని సీఎం ఇటీవలే పంపించారు. అక్కడ విజయవంతంగా అమలవుతున్న “విద్యార్థులకు అల్పాహారం” పథకాన్ని అధ్యయనం చేసిన ఈ అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది. 

తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సీఎం దృష్టికి బృందం తీసుకువచ్చింది. విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించే సీఎం కేసీఆర్, ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్టును అందచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేయనున్నది.