Skip to content

Kondagattu Anjaneya Swamy Temple History – Best Time To Visit

Kondagattu Anjaneya Swamy temple history

Kondagattu Anjaneya Swamy Temple

మహావృక్షాల ఆవరణలో ఆధ్యాత్మికత ఉట్టిపడే ప్రశాంతమైన వాతావరణంలో కోరంద పొదల మధ్యలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడి దాసశ్రేష్టుడయిన శ్రీఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిసి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా కొలువు దీరిన మహిమాన్వితమైన క్షేత్రమే కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక చరిత్ర కలిగి ఉన్నది. ఈ స్వామిని భక్తులు కొండగట్టు అంజన్నగా కూడా పూజిస్తారు. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఈ ప్రసిద్ధ దేవాలయం కలదు. ఆలయ ప్రాంగణంలో ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో స్నానాదులు ఆచరిస్తే చేసిన పాపాలు తొలుగుతాయని, వ్యాధిగ్రస్తుల వ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Kondagattu Anjaneya Swamy Temple History – స్థలపురాణం

దాదాపు ఐదు వందల సంవత్సరాలకు పూర్వం కొడిమ్యాల పరగణా వాస్తవ్యుడైన సింగం సంజీవుడు అనబడు పశువుల కాపరి కొండగట్టు గుట్టలో పశువులను మేపడానికి వెళ్ళగా మందలో నుండి ఓ ఆవు తప్పిపోగా, దాని గురించి వెతికి వేసారిన సంజీవుడు ఓ చింతచెటు చెట్టుకింద సేదతీరుతూ నిద్రిస్తున్న సమయంలో ఆంజనేయస్వామి స్వప్నంలో సాక్షాత్కారమై అక్కడికి దగ్గరలో ఉన్న కోరంద పొదల్లో తాను వెలశానని ఎండ, వర్షాల బారినుంచి తనకు రక్షణ కల్పించాలని సూచిస్తూ ఆవు జాడ కూడా చెప్పాడట. కళ్లు తెరచి చూసిన సంజీవుడికి ఆవు కనిపించడంతో అమితానందభరితుడై స్వామి పట్ల భక్తిభావాన్ని కనబరుస్తూ కోరంద ముళ్లపొదలను తొలగించి చూస్తే శంఖు, చక్ర గదాలంకరణను కలిగి మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి విగ్రహ రూపంలో దర్శనమిచ్చాడట. అక్కడే స్వామివారికి సంజీవుడు చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక కథనం వలన తెలుస్తున్నది. ఆలయ దక్షిణ భాగంలో చెక్కబడిన శిలాక్షరాలు ఈ చారిత్రక కథనానికి సాక్షంగా కనపడతాయి. దేవాలయానికి ఈశాన్యభాగంలో గల గుహల్లో మునులు తపస్సు చేసినట్లుగా ఆధారాలు కూడా కలవు.

Story of Kondagattu Name – కొండగట్టు పేరు వెనుక ఉన్న కథ

ఈ ఆలయానికి ఆ పేరు రావడం వెనుక పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. లంకలో జరిగిన రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినపుడు ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వెళ్తున్న సమయంలో అందులో నుండి ఒక ముక్క రాలి ఈ కొండలలో పడడం, అది కొండగట్టుగా ప్రసిద్ధి చెందడం జరిగిందనే పురాణగాథ ఒకటి ప్రచారంలో కలదు.

ఇక్కడి ఆంజన్న దేవాలయం నల్లరాతి బండల సమూహాంతో, గుహలతో, అనేక రకాల వృక్షజాతులతో కూడిన అటవీ ప్రాంతంలో కలదు. ఆలయం చుట్టూ పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలపై మరొక చిన్న గుట్ట ఏర్పడి ఉండగా, ఆ గుట్టపై ఆంజనేయస్వామి వెలియడంతో కొండగట్టు అని పేరువచ్చిందని ప్రచారంలో ఉన్న మరొక కథనం.

Kondagattu Anjaneya Swamy Temple interesting Facts – ఆలయ విశేషాలు

కొండగట్టు ఆలయంలో కొలువై ఉన్న అంజన్న. నరసింహస్వామి, ఆంజనేయస్వామి ద్విముఖాలతో దర్శనమిస్తాడు. ఇటువంటి రెండు ముఖాలతో వెలసిన స్వామి ఇక్కడ తప్ప మరెక్కడా లేకపోవడం విశేషం. నరసింహస్వామి విష్ణుమూర్తి అవతార స్వరూపం కాబట్టి ఆ స్వామి చిహ్నాలైన శంఖం, చక్రం ఆంజనేయస్వామి ఇరు బాహువులకి; అదే విధంగా వక్షస్థలంలో శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు ఉండడం ఇక్కడి విశేషం. ఆలయానికి దగ్గర్లో గల సీతమ్మవారి బావిలోని నీళ్లతోనే ప్రతినిత్యం స్వామికి అభిషేకం చేయడం ఇక్కడి ఆనవాయితీగా ఉన్నది.

ఈ ఆలయంలో ఒకే మంటపంలో మూడు వేర్వేరు గర్భ గుడులుంటాయి. మధ్యలో ఆంజనేయ స్వామి, కుడివైపున వేంకటేశ్వరస్వామి, ఎడమ వైపున అమ్మవారు వెలిసి ఉంటారు. ఎడమవైపు శివపంచాయతన ఆలయం ఉంటుంది. పశ్చిమం వైపున క్షేత్ర పాలకుడైన భేతాళస్వామి దర్శనమిస్తాడు. బేతాళస్వామికి దక్షిణాన రామపాదుకలు ఉంటాయి. మరికొంత దూరంలో పొలిమేర దేవుడయిన బొజ్జ పోతన్న ఉంటాడు. ఆలయ ప్రధాన గోపురానికి ఇరువైపులా ఏనుగు బొమ్మలు, గోపురం పైన ఆంజనేయుడి విగ్రహాలు చెక్కబడి ఉంటాయి.

అంజన్న సన్నిధిలో దీక్ష తీసుకుని 40 రోజుల నియమానుసారం పూజ చేస్తే అనారోగ్యం బారిన పడిన వారికి, దీర్ఘకాల రోగ పీడితులకు, మానసిక రోగులకు స్వామి కటాక్షం లభించి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధింస్తుందని; సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

Kondagattu Anjaneya Swamy Temple Important Devotional Days – ఆలయంలో నిర్వహించబడే పర్వదినాలు

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్ర, వైశాఖ మాసాల్లో రెండుసార్లు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ పర్వదినం సందర్భంగా ఆంజనేయస్వామి దీక్ష తీసుకున్న లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనార్ధం తరలి వస్తుంటారు. ఉగాది పండుగ రోజు స్వామి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. చైత్ర శుద్ధనవమి రోజున అత్యంత వైభవంగా జరిగే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా జరుపుతారు. శ్రావణమాసంలో సప్తాహ ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం నెల రోజులపాటు ధనుర్మాసోత్సవాలు, తిరుప్పావై, గోదారంగనాయకుల కళ్యాణం జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు ఉత్తరద్వారం ద్వారా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆలయ పవిత్రత కొరకు ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు జరుగుతాయి. అంతే కాకుండా ప్రపంచ శాంతి కొరకు, లోక కల్యాణార్ధం ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహిస్తారు.

Kondagattu Anjaneya Swamy Temple History In English

Kondagattu Anjaneyaswamy Temple is a glorious field where Sri Anjaneyaswamy, who is the true servant of Sri Ramachandra, shines as Swayambhu and fulfills the wishes of the devotees in a peaceful atmosphere where spirituality is infused in the surroundings of great trees.

Among the famous shrines in Telangana state, Kondagattu Anjaneyaswamy Temple has a unique spiritual history. Devotees also worship this lord as Kondagattu Anjanna. This famous temple is located in Mutyampeta village of Malyala mandal of Jagityala district of the state. It is a deep belief of the devotees that taking a bath in Pushkarini, where nature is ready in the temple premises, will remove the sins committed and cure the diseases of the sick.

Anjaneya Swamy Temple History In English – స్థలపురాణం

About five hundred years ago, a herdsman named Singam Sanjeeva from Kodimyala Pargana went to graze his cattle in Kondagattu Gutta and a cow was missing from the herd. Sanjeeva, who was searching for it, was sleeping under a pine tree and realized in the dream of Anjaneyaswami that he came out from the sun and rain in the corundum bushes near him. A cow trail is also said to indicate protection. When Sanjeev opened his eyes and saw a cow, Amitanandabharita showed his devotion to the Lord. When he removed the thorn bushes, he saw a glorious Anjaneya Swami statue with a conch and chakra decoration. It is known from the historical account that Sanjeeva built a small temple for the Lord there. Inscribed stone inscriptions on the southern side of the temple bear witness to this historical narrative. There are also evidences of ancient penance in the caves in the north-east of Delaya.

Interesting Story of Kondagattu Name

There are many stories circulating behind the name of this temple. There is a popular legend that when Lakshmana fainted during the battle of Ramaravana in Lanka, while Anjaneya was carrying Sanjeevani mountain, a piece of rock from it fell in these hills and it became known as Kondagattu.

The Anjanna temple here is situated in a forest area with black rock formations, caves and a variety of flora. Another popular story is that there are big hills around the temple and another small mound is formed on those hills, and the name Kondagattu came from the appearance of Anjaneyaswami on that mound.

Sri Kondagattu Anjaneya Swamy Temple Pooja Timings

Kondagattu Anjaneya Swamy Temple History - Best Time To Visit 2

Frequently Asked Questions about Kondagattu Temple

Which district is Kondagattu Temple?

Jagtial

What time does Kondagattu close?

Kondagattu Anjaneya Swami temple timings are from 4:30 AM to 8:30 PM

Why is Kondagattu famous?

The Kondagattu Anjaneya Swamy Temple is a well-known temple in Telangana, India that’s dedicated to Lord Anjaneya Swamy. It’s situated in Muthyumpeta village, which is part of the Mallial mandal in Jagitial district. If you’re traveling to the temple, it’s about 15 km away from Jagtial and 35 km away from Karimnagar.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *