Skip to content

10 Unknown facts About Sri Ram Sagar Project in Telangana State

తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లాలకు జీవనాడిగా పిలువబడే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించిన బహుళార్ధసాధక ఆనకట్ట. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గాను అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జూలై 26, 1963న శంకుస్థాపన చేశారు. కాగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం మొత్తం పూర్తవడానికి సుమారు 20 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో దీనికి పోచంపాడు ప్రాజెక్ట్ అనే పేరుండేది. తరువాత కాలంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోను జారీచేస్తూ పోచంపాడు ప్రాజెక్ట్ పేరును శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా మార్చింది. నిజామాబాద్ జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారి నుండి సుమారు 3 కి.మీ దూరంలో ఈ ప్రాజెక్ట్ నిర్మించబడి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో గోదావరినదిపై నిర్మించిన మొట్టమొదటి బహుళార్ధసాధక ప్రాజెక్టు ఇదే.

Architecture History of Sri Ram Sagar Project In Telugu

కరువు ప్రాంతమైన తెలంగాణ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాలుగా నీటిపారుదల వ్యవస్థ స్థానికంగా నిర్మించబడిన గ్రామట్యాంకుల మీదనే ఆధారపడి ఉండేది. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తరువాత 1951లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి, ప్రణాళికా సంఘానికి గోదావరి నదిపై పోచంపాడు గ్రామం వద్ద ఒక ఆనకట్ట నిర్మించాలనే ప్రతిపాదనతో పాటు గోదావరికి ఉపనదులైన కడెం, మానేర్ నదులపై ఆనకట్టలను నిర్మించడానికి ప్రతిపాదనలను కూడా సమర్పించింది. 1958 సంవత్సరంలో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు మరికొంతగా సవరించబడి చివరికి 26 జూలై 1963న ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రారంభంలో కేవలం నీటిని నిల్వచేసే ఒక రిజర్వాయర్ గానే ఉండి, నీటిపారుదల అవసరాలను మాత్రమే తీర్చేది. కానీ 1983 సంవత్సరం తరువాత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రాజెక్టు విస్తరణను చేపట్టి జల విద్యుదుత్పాదన సంస్థగా అభివృద్ధి చేయడం జరిగింది.

ఈ డ్యామ్ ఎగువ భాగంలో అత్యధిక పరీవాహక ప్రాంతం మహారాష్ట్రలో ఉన్నది. మహారాష్ట్రలోని ముంపు ప్రాంతాన్ని తగ్గించేందుకు శ్రీరామ్ సాగర్ డ్యామ్ ప్రత్యక్ష నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పరిమితం చేయబడింది.
ఉత్తర తెలంగాణకు ఈ ప్రాజెక్టు జీవనాధారంగా పరిగణించబడుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నీటిపారుదల సౌకర్యాలు తీరుస్తుండగా, వరంగల్ నగరానికి తాగునీరు కూడా అందిస్తున్నది. 42 వరదగేట్లను కలిగి ఉన్న ఈ ఆనకట్ట సామర్థ్యం 75 బిలియన్ క్యూబిక్ అడుగులు. దీని నీటిమట్టం గరిష్ట ఎత్తు 1190అడుగులు కాగా, 90 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో సరస్వతి, కాకతీయ, లక్ష్మి అనే మూడు కాలువలు ఉన్నాయి. అంతేకాకుండా, వరద నీటిని దిగువ జిల్లాలకు విడుదల చేసేందుకు వరద ప్రవాహ కాలువను కూడా తవ్వడం జరిగింది. లక్ష్మీ కాలువను ఎత్తయిన ప్రదేశంలో నిర్మించడంవలన దాని ద్వారా కేవలం రెండు టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించబడిన ప్రదేశంలో ఒక జలవిద్యుత్ ప్లాంట్ కూడా పని చేస్తున్నది. 9 మెగావాట్ల సామర్థ్యంతో 36 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే 4 టర్బైన్లు ఇక్కడ కలవు. ఈ ప్రాజెక్టు నీటిని రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి సరఫరా చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టును స్థానికంగా ఖుస్తాపురం ఆనకట్టగా కూడా పిలుస్తారు. నిజాం పాలనా కాలంలోని హైదరాబాద్ రాష్ట్రం ద్వారా 227 టీఎంసీ ఘనపుటడుగుల ఎగువ గోదావరి నది నీటిని ఉపయోగించుకోవడానికి మొదటిసారిగా ఖుస్తాపురం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది.

ప్రాజెక్టు వివరాలు

ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశలో భాగంగా సుమారు 1 మిలియన్ ఎకరాల (400,000 హెక్టార్లు) 140 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి నీటిపారుదల సౌకర్యం కల్పించబడింది. 25 టీఎంసీల నీటిని ఉపయోగించి 440,000 ఎకరాలకు (180,000 హెక్టార్లు) నీరందించడానికి ఈ ప్రాజెక్ట్ యొక్క రెండవ దశ నిర్మాణం అధునాతన దశలో ఉన్నది. ఈ ఆనకట్ట వద్ద అందుబాటులో ఉన్న 20 టీఎంసీ అడుగుల నీటిని ఉపయోగించి 200,000 ఎకరాలకు (81,000 హెక్టార్లు) నీరందించడానికి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్రాజెక్ట్ కూడా అమలులో ఉంది.

పర్యాటక ప్రాంతంగా – Popular Tourism Place

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పర్యాటకులకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడమే కాకుండా ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా కూడా మార్చబడింది. ఈ ఆనకట్ట సమీపంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఒక ద్వీపం కలదు. వలస పక్షులు అన్ని కాలాల్లో ఈ ద్వీపానికి వలస వస్తాయి. ఆనకట్టకు సమీపంలో ఒక సుందరమైన తోట కూడా ఉన్నది. పర్యాటకుల కోసం ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసారు. ఇక్కడ గోదావరి నది ఒడ్డున గల శ్రీరాముడి దేవాలయం గోదావరి పుష్కరాల సమయంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో డ్యామ్ యొక్క గేట్లు తెరిచే సమయంలో ఈ ప్రదేశం పర్యాటకులకు మరింత ఆకర్షణీయ ప్రదేశంగా మారుతుంది.

Inter State Water Issue – అంతర్రాష్ట్ర జల వివాదం

ఈ ఆనకట్ట యొక్క పరివాహక ప్రాంతంలో, ‘గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్’ (GWDT) క్రింద మహారాష్ట్ర తన నీటి వినియోగానికి మించి మధ్యతరహా, చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించింది. ఈ ప్రధాన నీటిపారుదల ప్రాజెక్ట్ గత దశాబ్దంలో కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి నీటి లభ్యత లేకుండా నిరుపయోగంగా ఉన్నది. అప్ స్ట్రీమ్ రివర్ బేసిన్ ప్రాంతంలో నదీజలాల పూర్తి వినియోగం కారణంగా, రిజర్వాయర్ లోని నీటి నాణ్యత అధిక క్షారత్వం మరియు లవణీయతలను కలిగి ఉండడం వలన ఈ నీరు మనుషులు గాని పశువులు గాని వినియోగించడానికి అంతగా సురక్షితమైనది కాదు. అంతేగాకుండా పోచంపాడు ఆనకట్ట పరీవాహక ప్రాంతంలోని దిగువ ప్రాంతాలలో ఉన్న భూగర్భ జలాలు నీటిపారుదలకు, మనుషుల సాధారణ వినియోగానికి కూడా అంతగా పనికిరాకుండా ఉన్నాయి.

1975వ సంవత్సరంలో బాబ్లీ ప్రాజెక్ట్ వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును అనుసరించి వర్షాకాలంలో జూలై 1 నుండి అక్టోబర్ 28 వరకు బాబ్లీ బ్యారేజీ గేట్లను ఎత్తివేయాలని, దీని కారణంగా గోదావరి నది సహజ ప్రవాహానికి ఎటువంటి ఆటంకం ఉండదని నిర్దేశించడం జరిగింది. అంతే కాకుండా పైఠాన్, సిద్దేశ్వర్, నిజాంసాగర్ ఆనకట్టల దిగువన ఉన్న గోదావరి బేసిన్ ప్రాంతం నుండి లభ్యమవుతున్న నీటిని తరలించడానికి పోచంపాడు జలాశయానికి ఇతర రిజర్వాయర్ల (మేజర్, మీడియం, మైనర్, బ్యారేజీ మొదలైనవి) కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 1975 నాటి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నీటి పంపకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పర్యవేక్షణ కమిటీని కూడా నియమించింది.

Sri Ram Sagar Project In English

Known as the lifeline of many districts of Telangana State, Sriram Sagar Project is a multi-purpose dam constructed on the Godavari River at Pochampadu in Balkonda Mandal of Nizamabad District. The then Prime Minister of India Jawahar Lal Nehru laid the foundation stone for the construction of this project on July 26, 1963. While the entire construction of Sri Ramsagar project took about 20 years to complete. At the time of its inception, the project was known as Pochampadu Project. Later on, the then Andhra Pradesh government issued a G.O and changed the name of Pochampadu project to Sriramsagar project. The project is constructed at a distance of about 3 km from National Highway No. 44 in Nizamabad district. This is the first multi-purpose project built on Godavari river in Telangana state.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *