Doddi Komaraiah – తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆద్యుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య
Doddi Komaraiah Story In Telugu
తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం, భుక్తికోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబములో జన్మించిన కొమరయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం.
అప్పట్లో నిజాం పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు, దేశ్ పాండేలు మొదలైన దొరల దురాగతాల కారణంగా విసిగి వేసారిన ప్రజలకు ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుల సంఘం ఒక దివిటీ లాగా కనిపించేది. దొడ్డి కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య కూడా ఆంధ్రమహాసభ కమిటీ సభ్యుడిగా పనిచేసేవాడు. తన అన్న ప్రభావం చేతనూ, దొరల దురాగతాలు ఎదిరించడానికి ఆంధ్రమహాసభయే చక్కని వేదిక అని గ్రహించిన కొమరయ్య కూడా సంఘంలో చేరి దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవాడు.
జనగామ తాలూకాలో విసునూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి ఆధీనంలో ఉన్న 60 గ్రామాలలో ఒకటైన కడివెండి గ్రామంలో దేశ్ ముఖ్ రామచంద్రా రెడ్డి తల్లి దొరసాని అయిన జానకమ్మ నివసించేది. ఆమె ప్రజల పట్ల వ్యవహరించే తీరుకు ప్రజలంతా ఆమెను ఒక రాక్షసి లాగా భావించేవారు. దొడ్డి మల్లయ్యకి, దొరసానికి అనేకమార్లు తగాదాలు జరిగడం వలన దొరసాని దృష్టిలో మల్లయ్య ప్రధాన శత్రువుగా మారాడు.
కడివెండి ప్రజలు ఆంధ్రమహాసభ (సంఘం) అండతో దొరసాని జానకమ్మకు పన్నులు చెల్లించడం ఆపేశారు. దీంతో జానకమ్మ ఆగ్రహానికి అడ్డూ అదుపూ లేకుండా పోయి పన్ను చెల్లించడం ఆపిన వారిపైనా, ముఖ్యంగా జానకమ్మకు ఎదురొడ్డి నిలిచిన దొడ్డి మల్లయ్య కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. కొమరయ్య తన సోదరుడికి అండగా నిలబడడంతో దొరసాని ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. చివరికి దేశ్ ముఖ్, దొరసాని కలిసి మల్లన్న, కొమరయ్యలను మరియు సంఘం సభ్యులను హత్యచేయించడానికి కిరాయి గూండాలను పురమాయించారు. ఈ విషయాన్ని గ్రహించిన గ్రామసంఘ నాయకులు తమ సభ్యుల ఆత్మరక్షణార్ధం 60 మంది వాలంటీర్ల దళాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.
1946 జూలై 4వ తేదీన ఎలాగైనా సరే కమ్యూనిస్టు పార్టీ నాయకులపై దాడి జరపాలని పన్నిన కుట్రలో భాగంగా దేశ్ ముఖ్ అనుచరుడు మస్కీన్ అలీ ఆధ్వర్యంలో 40 మంది గుండాలు కడవెండి గ్రామంలోకి ప్రవేశించి చీకటి పడే సమయానికి సంఘం కార్యకర్తలను అసభ్యకర పదజాలంతో దూషిస్తూ, రెచ్చగొడూ వారి ఇళ్ళ మీదికి రాళ్ళు రువ్వడం మొదలెట్టారు. దీనికి ధీటుగా సంఘంలో ముఖ్య సభ్యుడు కె.రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మందికి పైగా ప్రజలు ఏకమై దొరలకు వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రదేశాన్నంతా హోరెత్తిస్తూ ర్యాలీగా బయల్దేరారు.
వీరితో పాటు కొమరయ్య తన అన్న మల్లయ్యతో కల్సి ముందు వరుసలో నిల్చున్నాడు. అంతకు ముందే దొరసాని గడీకి ఎదురుగా ఉన్న పాఠశాల భవనంలో మిష్కిన్ అలీ నాయకత్వంలో మకాం వేసి ఉన్న దేశ్ ముఖ్ కి సంబంధించిన ప్రైవేట్ రక్షణదళం ర్యాలీగా వస్తున్న ప్రజలను చూసి దిగ్ర్భాంతులై ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే కాల్పులు జరపడం ప్రారంభించగా ముందు వరుసలో నిలుచున్న దొడ్డి మల్లయ్య కాలికి, దొడ్డి కొమరయ్యకు పొట్టభాగంలో తూటాలు తగిలాయి.
కొమరయ్య ఆంధ్రమహాసభకు జై, కమ్యూనిస్టు పార్టీకి జై అని నినదిస్తూ నేలకొరిగాడు. ఈ సంఘటనతో ప్రజలు మరింత ఆవేశంతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దొరసాని కిరాయి గూండాలను అంతమొందించడానికి సన్నద్ధమవడంతో గూండాలు దొరసాని గడిలోకి వెళ్ళి తమ ప్రణాలు కాపాడుకున్నారు.
కొమరయ్య మరణవార్తతో చుట్టుపక్కల గల గ్రామాల ప్రజలంతా ఆవేశపూరితులై కడివెండి గ్రామానికి చేరుకుని ప్రతీకార చర్యలకు పూనుకున్నారు. కొమరయ్య పార్థివ దేహాన్ని నెల్లుట్ల గ్రామం వద్ద ఖననం చేశారు. కొమరయ్య హత్యతో శాంతియుతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం తెలంగాణ సాయుధ విప్లవోద్యమంగా మారింది. తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరుడైన తొలి వ్యక్తి మరియు రైతుగా కొమరయ్య తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
Doddi Komaraiah Story In English
The immortality of Doddi Komaraiah was the main reason for the beginning of the armed struggle in Telangana. Doddi Komaraiah was the first person who came to mind when we think about the Telangana armed struggle history. Komaraiah was born into a family of shepherds belonging to a common Kuruma caste in Kadavendi village in the united Warangal district; he is a source of pride for the people of Telangana to have spearheaded an outstanding movement.
The Andhra Mahasabha Communist Society looked like a beacon to the people who were tired of the atrocities of the Jagirdars, Deshmukhs, landlords, Deshpandis, etc., in the villages of Telangana during the Nizam rule at that time. Doddi Komaraiah’s elder brother Doddi Mallya was a member of the Andhra Mahasabha Committee. Under the influence of his brother, Komaraiah realized that the Andhra Mahasabha was a good platform to confront the atrocities. He then joined the community and fought against the aristocracy.
There were 60 villages in Janagama taluka owned by Visunur Deshmukh Ramachandra Reddy. Countess Janakamma, the mother of Ramachandra Reddy, lived in Kadavendi village. People treated her like a monster because of the way she treated people. Doddi Mallya became the main enemy in the eyes of the Janakamma due to several fights with her.
The people of Kadavendi, with the support of the Andhra Mahasabha (Sangh), stopped paying taxes to Countess Janakamma. Janakamma took action against those who stopped paying taxes, especially against the Doddi Mallya family, who opposed her. Janakamma was furious when Komaraiah stood up for his brother. Eventually, Deshmukh and Countess Janakamma hired mercenaries to kill Mallaya, Komaraiah, and community members. Noticing this, the village leaders formed a force of 60 volunteers to protect their members.
On July 4, 1946, 40 gunmen, led by Deshmukh follower Muskin Ali, entered the village of Kadavendi as part of a plot to attack Communist Party leaders. By the time it got dark, Muskin Ali and his team started insulting the activists and community with obscene language and provocatively throwing stones at their houses.
In response, K. Ramachandra Reddy (a key community member) led more than 200 people and rallied around that area by chanting slogans against the Deshmukh dynasty. Along with them, Komaraiah was in the front row with his brother Mallaya. Deshmukh’s private security forces, led by Mishkin Ali, stayed in a school building across the street. They saw people coming to a rally and started firing without any prior notice. Doddi Mallya, who was standing in the front row, was shot in the leg and Doddi Komaraiah in the abdomen.
Komaraiah fell to the ground by shouting slogans Jai Andhra Mahasabha and Jai Communist Party. With this incident, the people became more and more furious, chanting slogans on a large scale. Then the gunmen and Countess went to the temple and saved their lives. With the news of Komaraiah’s death, all the people of the surrounding villages rushed to Kadavendi village and started planning how to take revenge against Countess and her family.
Komaraiah’s dead body was buried at Nellutla village. With the death of Komaraiah, the peaceful peasant movement became the Telangana Armed Revolution. Komaraiah remained in the hearts of the people of Telangana forever as the first martyr in the Telangana peasant struggle.
Who was the first martyr of Telangana struggle?
Doddi Komaraiah
Doddi Komaraiah Date of Birth
April 3rd