Skip to content

Telangana GPO Recruitment – 10,954 Grama Palana Officers గ్రామ పాలనా అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరు చేయబడినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయిలో పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది.

కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు “జిపిఓ” అని పేరు పెట్టారు. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలనాధికారులను నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ప్రభుత్వం వీఆర్ఎ, వీఆర్ వ్యవస్థలను రద్దు చేసింది. వీఆర్ఎ, వీఆర్లను ఇతర ప్రభుత్వ శాఖల్లో కలిపేసింది. మళ్లీ గ్రామ పాలనాధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు.

More details will be availble once the official Telangana Grama Palana Officers recruitment is released.