తెలంగాణ వెబ్ – ఒక అవలోకనం – (తెలంగాణ సమగ్ర సమాచార వేదిక)
TelanganaWEB is an Online Education Portal, which provides News, Education, Tourism, History related information about Telangana State.
తెలంగాణ రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ, ప్రభుత్వ సేవల సంబంధిత తాజా సమాచారాన్ని సమగ్రంగా అందించే వెబ్ పోర్టల్ తెలంగాణ వెబ్. ఈ పోర్టల్ తెలంగాణ రాష్ట్ర సంబంధింత సమాచారానికి ఒక సంపూర్ణమైన వేదిక. రాష్ట్రంలోని పోటీ పరీక్షార్థులకు అవసరమైన ఉద్యోగ ప్రకటనల తాజా మాచారాన్ని, అదే విధంగా విద్యార్థులకు తాజా విద్యా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడమే కాకుండా వివిధ రకాల ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారం కూడా ఈ పోర్టల్ లో పొందుపరచడం జరిగింది. ప్రతినిత్యం లభించే తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు వీక్షకులకు అందించేందుకు గాను ఈ పోర్టల్ ప్రత్యేకంగా తనవంతు కృషి చేస్తున్నది.
ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగకరమైన అంశాలైన వివిధ ఉద్యోగ ప్రకటనలు, పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ అంశాలు, స్టడీమెటీరియల్ ప్రత్యేకించి తెలంగాణ సంబంధిత అంశాలైన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు, పర్యాటక ప్రదేశాలు, దేవాలయాల సమగ్ర సమాచారాన్ని అందించడం జరుగుతున్నది. కేవలం పోటీపరీక్షలు రాసే వారికే కాకుండా విషయ జిజ్ఞాస కల వీక్షకులెవరైనా కూడా ఈ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా తెలంగాణ సంబంధిత అంశాలలో కనీస పరిజ్ఞానాన్ని తప్పకుండా పొందగలుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక ప్రభుత్వ సేవల విషయానికి వస్తే రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన దరఖాస్తు విధానాలు, ఆసరా పెన్షన్లకు ఏ విధంగా దరఖాస్తు చేయాలి, భూముల రికార్డులను ఏ విధంగా పొందాలి, ఎల్.ఆర్.ఎస్.దరఖాస్తు వివరాలు; రాష్ట్రప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల తాజా సమాచారం; విద్యార్థులకు అవసరమైన స్కాలర్ షిప్ దరఖాస్తులు, ఇ-పాస్ తదితర వివరాలపూర్తి సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.
తెలంగాణకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకే వేదికగా తెలుసుకోవాలనుకునే వీక్షకులకు ఈ పోర్టల్ ఎంతో ఉపయుక్తమైనది.
Contact us at [email protected] & [email protected]
For more details follow us on
Subscribe our Youtube Channel at Youtube.com/c/telanganawebportal