Replacing VRO Post as a New Junior Assistant in Mandal Level – VRO ల స్థానంలో కొత్తగా జూనియర్ అసిస్టెంట్స్

VRO  ల స్థానంలో కొత్తగా జూనియర్ అసిస్టెంట్స్

గత ఏడాది రెవిన్యూ శాఖ లో సంస్కరణల వాళ్ళ VRO ల వ్యవస్థ రద్దు అయింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో గత ఏడాది ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో రెవెన్యూ శాఖ పనితీరు మారింది. తహసీల్దార్లు సంయుక్త సబ్‌రిజిస్ట్రార్ల హోదాలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అపరిష్కృత సమస్యలు, ప్రభుత్వ భూముల విషయంలో తప్ప దస్త్రాలను తిరగేసే అవసరం లేదు. అయితే పెరిగిన జనాభాకు అనుగుణంగా ధ్రువీకరణ పత్రాల జారీ, ప్రభుత్వ పథకాల సమాచారం, కలెక్టర్ల నుంచి వచ్చే ప్రొటోకాల్‌ విధులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో విధుల వంటి బాధ్యతలు తహసీల్దారు కార్యాలయానివే.

Related ArticleHow to Apply Ration Card in Telangana

గతంలో వీఆర్వోలు ఈ విధులను నిర్వహించేవారు. వారికి బదులుగా ప్రతి మండలానికి పది మందికి తగ్గకుండా జూనియర్‌ అసిస్టెంట్లను నియమించాలనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఇలా 1800 మందిని తీసుకోవాలని ప్రస్తుతం భావిస్తున్నా, అవసరాలను బట్టి అయిదు వేలకు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. జూనియర్‌ అసిస్టెంట్ల ప్రతిపాదన ఉన్నా, అవసరమైతే జూనియర్‌ ఆర్‌ఐల స్థాయిలో ఎంపిక చేయాలనే ఆలోచన కూడా ఉంది. 1985కి ముందు గ్రూప్‌-2 ద్వారా ఆర్‌ఐలను ఎంపిక చేసేవారు.

Source : Eenadu News