Arogya Mahila Scheme: Telangana Government Initiative – Healthcare for Women
Telangana state government is preparing to introduce ‘Arogya Mahila’ on Wednesday March 8th 2023, which is International Women’s Day, an initiative dedicated to providing comprehensive healthcare services to women of all age groups across Telangana.
Arogya Mahila Scheme: మహిళల కోసం కొత్త స్కీమ్.. ఉచితంగా 8 రకాల వైద్య పరీక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8 నుంచి ఈ కొత్త పథకాన్ని అమలు చేయనుంది.
Health Services under Arogya Mahila Scheme 2023
ఈ ఆరోగ్య మహిళా పథకం లో భాగంగా.. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించనున్నారు. తెలంగాణకు ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలనేదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
ఆరోగ్య మహిళా పథకం లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కింది 8 రకాల పరీక్షలను చేస్తుంది.
- 1. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు చేస్తారు.
- 2. ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల పరీక్షలు అనగా స్రీనింగ్ కూడా నిర్వహిస్తారు.
- 3. థైరాయిడ్ పరీక్ష, అయోడిన్ సమస్య, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, ఫోలిక్‌యాసిడ్, ఐరన్‌లోపంతోపాటు విటమిన్ డీ, విటమిన్ బీ12 పరీక్షలు చేసి చికిత్స మరియు మందులు అందజేస్తారు
- 4. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు
- 5. మెనోపాజ్ దశకు(Menopause) సంబంధించి పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్(Hormone Replacement) థెరపీ చేయడంతోపాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
- 6. నెలసరి (Periods), సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి, వైద్యంతోపాటు అవగాహన కల్పిస్తారు. మరియు ఇందులో అవసరమైనవారికి అల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా చేస్తారు.
- 7. సెక్స్ సంబంధిత మరియు అంటువ్యాధుల పరీక్షలు చేసి, అవగాహన కల్పిస్తారు. అవసరమైన వారికి వైద్యం కూడా అందిస్తారు.
- 8. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై కూడా అవగాహన కలిపించడం జరుగుతుంది.